Peddi Director | ‘పెద్ది’ దర్శకుడిని లాంగ్ డ్రైవ్‌కు తీసుకెళ్లిన రామ్ చరణ్.. వీడియో!
Ram charan | రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘పెద్ది’ (Peddi) విడుదలకు సిద్ధమవుతోంది.
Ram charan | రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘పెద్ది’ (Peddi) విడుదలకు సిద్ధమవుతోంది. జూన్ 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో, చిత్ర యూనిట్ ప్రమోషన్ల స్పీడ్ పెంచింది. సినిమాపై హైప్ క్రియేట్ చేసేందుకు సరికొత్తగా ప్లాన్ చేస్తోంది. తాజాగా హీరో రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు ప్రచారంలో భాగంగా ఒక ప్రత్యేకమైన ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
అయితే ఇది మామూలు ఇంటర్వ్యూలా కాకుండా, రామ్ చరణ్ స్వయంగా కారు డ్రైవ్ చేస్తూ బుచ్చిబాబును ఒక షికారుకి తీసుకెళ్లారు. ప్రయాణంలోనే వీరిద్దరూ సినిమా ముచ్చట్లను పంచుకున్నారు. ఈ సందర్భంగా బుచ్చిబాబు మాట్లాడుతూ.. “సినిమా పనులతో ఇంత బిజీగా ఉన్నప్పటికీ, నన్ను ఇలా లాంగ్ డ్రైవ్‌కు తీసుకువచ్చినందుకు థాంక్యూ చరణ్ సార్” అంటూ తన ఆనందాన్ని పంచుకున్నారు. దానికి చరణ్ స్పందిస్తూ.. “అదంతా సరే కానీ, మన ‘పెద్ది’ సినిమా ఎప్పుడు వస్తుందో ప్రేక్షకులకు కచ్చితంగా చెప్పు” అని నవ్వుతూ అడిగారు. దీంతో వీరిద్దరూ కలిసి జూన్ 4న ‘పెద్ది’ సినిమా థియేటర్లలోకి వస్తోందని అధికారికంగా ప్రకటించారు. భారీ అంచనాలతో వస్తున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులందరూ థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయాలని రామ్ చరణ్, బుచ్చిబాబు కోరారు.
Drive with @AlwaysRamCharan Sir ❤️❤️🤗🤗
Full video out today 💥#Peddi pic.twitter.com/S4N2Ej9dpR
— BuchiBabuSana (@BuchiBabuSana) May 15, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

