దశాబ్దంలో ఒకసారి వచ్చే సినిమా
‘మాటలతో కాదు..ఆటతో బరిలో గెలిచే మగతనం ఎవరికి ఉందో రమ్మను..’ అంటూ ప్రత్యర్థులకు సవాలు విసురుతున్నాడు ఆటకూలీ పెద్ది. మరి ఆయన పోరు ఎవరి మీదో చూచాయగా తెలుసుకోవాలంటే ట్రైలర్ మీద ఓ లుక్కేయాల్సిందే. మెగాభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న రామ్‌చరణ్ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ థియేట్రికల్ ట్రైలర్‌ను సోమవారం ముంబయిలో విడుదల చేశారు.
‘మాటలతో కాదు..ఆటతో బరిలో గెలిచే మగతనం ఎవరికి ఉందో రమ్మను..’ అంటూ ప్రత్యర్థులకు సవాలు విసురుతున్నాడు ఆటకూలీ పెద్ది. మరి ఆయన పోరు ఎవరి మీదో చూచాయగా తెలుసుకోవాలంటే ట్రైలర్ మీద ఓ లుక్కేయాల్సిందే. మెగాభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న రామ్‌చరణ్ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ థియేట్రికల్ ట్రైలర్‌ను సోమవారం ముంబయిలో విడుదల చేశారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. ట్రైన్ సీక్వెన్స్‌తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఎమోషనల్‌గా సాగింది. పెద్ది తాలూకు ప్రపంచాన్ని పరిచయం చేయడం, అతన్ని క్రికెటర్‌గా, కుస్తీ యోధుడిగా, పరుగుల వీరుడిగా..ఇలా భిన్న ఆటల్లో ప్రావీణ్యం ఉన్నవాడిగా చూపించడం ఆసక్తిని పెంచింది. ‘మీరు అందరూ నేను ఆడానని అనుకుంటున్నారు.. కానీ నేను పోరాడాను’ అంటూ పెద్ది చెప్పిన డైలాగ్ హైలైట్‌గా నిలిచింది.
రామ్‌చరణ్ మాట్లాడుతూ ‘ఇది చాలా నిజాయితీగా చేసిన సినిమా. ఓ యువకుడు గుర్తింపు కోసం చేసే ప్రయాణమిది. నా కెరీర్లో అత్యంత స్ఫూర్తివంతమైన సినిమా. ఇలాంటి సినిమాలు దశాబ్దంలో ఒకసారి మాత్రమే వస్తాయి. మగధీర, రంగస్థలం, ఆర్.ఆర్.ఆర్ లాంటి సినిమాలు తరచుగా రావు. ‘పెద్ది’ కూడా అలాంటి సినిమానే. నా లైబ్రరీలో ఎప్పటికీ దాచుకునే సినిమా’ అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీశ్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మించారు. జాన్వీకపూర్, శివరాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందుశర్మ, బొమన్ ఇరానీ తదితరులు కీలక పాత్రధారులు. ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

