Ram Charan | డైపర్లు మార్చడం మాత్రం నా వల్ల కాదు .. తండ్రిగా తన ప్రయాణంపై రామ్ చరణ్ సరదా వ్యాఖ్యలు
Ram Charan | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’ విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుండగా, ప్రస్తుతం చిత్ర బృందం జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది.
Ram Charan | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’ విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుండగా, ప్రస్తుతం చిత్ర బృందం జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో రామ్ చరణ్ సినిమా విశేషాలతో పాటు తన వ్యక్తిగత జీవితం, కుటుంబం, తండ్రిగా తన అనుభవాల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
రామ్ చరణ్, ఉపాసన దంపతులకు ప్రస్తుతం ముగ్గురు పిల్లలు ఉన్నారు. పెద్ద కుమార్తె క్లిన్ కారాతో పాటు ఇటీవల జన్మించిన కవలలు కుటుంబానికి మరింత ఆనందాన్ని తెచ్చారు. పిల్లల పెంపకంలో తన పాత్ర గురించి మాట్లాడిన చరణ్, తాను సాధ్యమైనంత ఎక్కువ సమయం పిల్లలతో గడపడానికి ప్రయత్నిస్తానని చెప్పారు. నేను మంచి తండ్రినా కాదా అనేది నాకు తెలియదు. కానీ పిల్లల పెంపకంలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటాను. వాళ్లకు భోజనం పెట్టడం, నిద్రపుచ్చడం, ఆడించడం లాంటి పనులన్నీ చేస్తాను. క్లిన్ కారా చాలా సందర్భాల్లో నాతోనే నిద్రపోతుంది. అయితే డైపర్ మార్చాల్సిన సమయం వస్తే మాత్రం మెల్లగా అక్కడి నుంచి తప్పించుకుంటాను అంటూ నవ్వుతూ చెప్పిన చరణ్ వ్యాఖ్యలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
తన భార్య ఉపాసన గురించి మాట్లాడిన రామ్ చరణ్, కుటుంబంలో నిర్ణయాలు తీసుకునే విషయంలో ఆమెకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని సరదాగా తెలిపారు. పెళ్లైన తర్వాత ప్రతి భర్త నేర్చుకునే విషయం ఒకటే… ఇంట్లో భార్యే బాస్. మా ఇంట్లో కూడా ఉపాసనే బాస్. సినిమా జీవితంలో షెడ్యూల్స్ ఎప్పుడూ మారుతూ ఉంటాయి. ఎప్పుడు ఎక్కడ ఉండాలో తెలియని పరిస్థితులు ఉంటాయి. అలాంటి సమయంలో కుటుంబాన్ని బ్యాలెన్స్ చేయడానికి చాలా అవగాహన, అడ్జస్ట్మెంట్ అవసరం. ఆ విషయంలో ఉపాసన నాకు ఎప్పుడూ అండగా నిలుస్తుంది అని చరణ్ వెల్లడించారు. కాగా, రామ్ చరణ్, ఉపాసనల అనుబంధం చాలా ప్రత్యేకమైనది. స్కూల్ రోజుల నుంచే ఒకరికొకరు పరిచయం ఉన్న వీరిద్దరూ, తర్వాత కొంతకాలం దూరమైనా మళ్లీ కలుసుకుని స్నేహాన్ని ప్రేమగా మార్చుకున్నారు. 2012లో వివాహ బంధంతో ఒక్కటైన ఈ జంట, ఇప్పుడు ముగ్గురు పిల్లల తల్లిదండ్రులుగా ఆనందకరమైన జీవితాన్ని గడుపుతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- buchi babu
- glimpse
- Klinkaara
- peddi
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

