సస్పెన్స్ థ్రిల్లర్ కథ
రక్షిత్ శెట్టి హీరోగా నటిస్తున్న సినిమా ‘ఆపరేషన్ రావణ్'. సంగీర్తన విపిన్ నాయికగా కనిపించనుంది. ఈ చిత్రాన్ని సుధాస్ మీడియా పతాకంపై ధ్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ కథతో దర్శకుడు వెంకట సత్య రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను తాజాగా హైదరాబాద్‌లో విడుదల చేశారు.
రక్షిత్ శెట్టి హీరోగా నటిస్తున్న సినిమా ‘ఆపరేషన్ రావణ్’. సంగీర్తన విపిన్ నాయికగా కనిపించనుంది. ఈ చిత్రాన్ని సుధాస్ మీడియా పతాకంపై ధ్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ కథతో దర్శకుడు వెంకట సత్య రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను తాజాగా హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకులు మారుతి, కల్యాణ్ కృష్ణ, దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో రక్షిత్ శెట్టి మాట్లాడుతూ…‘ఈ సినిమాలో నటించేందుకు రాధిక ఒప్పుకోవడమే మొదటి విజయంగా భావిస్తున్నాను. మా నాన్న వెంకట సత్య ఈ సినిమాకు దర్శకుడు కావడం సంతోషంగా ఉంది. ఆయన అన్ని విషయాలు నేర్చుకుని దర్శకుడిగా మారారు.
మేకింగ్‌లో ప్రతి విషయం దగ్గరుండి చూసుకున్నారు. నా గత సినిమా పలాస విడుదల ముందు చెప్పాను ఆ సినిమా ఖచ్చితంగా ఆదరణ పొందుతుందని, ఇప్పుడు ఈ చిత్ర విజయంపై కూడా అదే నమ్మకంతో ఉన్నాం’ అన్నారు. నటి రాధిక మాట్లాడుతూ…‘ఈ సినిమాకు ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేశారు. శ్రమిస్తే తప్పకుండా సక్సెస్ అవుతారు అనేది నటిగా నా అనుభవంలో తెలుసుకున్నాను. కథను అందంగా తెరకెక్కించడంలో దర్శకుడు వెంకట సత్య రాజీ పడలేదు. కొత్త తరహా పాత్రల్లో నటించాలని కోరుకునే నాకు మరో మంచి క్యారెక్టర్ ఈ చిత్రం ద్వారా లభించింది. ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అని చెప్పింది. ఈ కార్యక్రమంలో ఇతర చిత్రబృందం పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Traders: 12వేల కోట్ల వ్యాపారంపై ప్రభావం.. ర్యాలీని వాయిదా వేయండి.. సోనియా గాంధీని కోరిన ఢిల్లీ వ్యాపారులు
Vijay | సీఎం విజయ్ మానవత్వం.. సైగలతో ఉద్యోగం అడిగిన దివ్యాంగుడికి 24 గంటల్లోనే నియామక పత్రం!
Nayanthara | ‘మూక్కుత్తి అమ్మన్-2’ నా హృదయానికి ఎంతో దగ్గరైన సినిమా.. నయనతార ఎమోషనల్ పోస్ట్ వైరల్
Mahatma Gandhi Grandson: అమెరికాలో 30 ఎకరాల భూమిపై వివాదం.. కేసు నెగ్గిన మహాత్మా గాంధీ మనవడి ట్రస్టు
Health tips | అరటిపండుతో అన్నీ లాభాలే.. అవేంటో తెలుసా..?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

