Stree-2 Movie | స్త్రీ మూవీ సీక్వెల్ షూటింగ్ ప్రారంభం.. రాజ్‌కుమార్-శ్రద్ధా కపూర్ సెల్ఫీ ఫోటో వైరల్
Stree-2 Movie Shooting Begins | ఐదేళ్ల కిందట బాలీవుడ్లో 'స్త్రీ' సినిమా సృష్టించిన రికార్డులు అంతా ఇంతా కాదు. కేవలం పదిహేను కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా నూటా ఎనభై కోట్ల రేంజ్లో కలెక్షన్లు కొల్లగొట్టింది.
Stree-2 Movie Shooting Begins | ఐదేళ్ల కిందట బాలీవుడ్లో ‘స్త్రీ’ సినిమా సృష్టించిన రికార్డులు అంతా ఇంతా కాదు. కేవలం పదిహేను కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా నూటా ఎనభై కోట్ల రేంజ్లో కలెక్షన్లు కొల్లగొట్టింది. కామెడీ హార్రర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా హిందీ జనాలను విపరీతంగా ఆకట్టుకుంది. మొన్న వచ్చిన ‘భేదియా’ మూవీ డైరెక్టర్ అమర్ కౌశికే స్త్రీ సినిమాను తెరకెక్కించాడు. అంతేకాకుండా ఆయనకు ఇది తొలిసినిమా. తొలి అడుగులోనే ఆ రేంజ్ హిట్ సాధించాడంటే ఆశా మాశీ కాదు. ఇక రాజ్‌కుమర్ రావు, శ్రద్ధా కపూర్ తమ తమ పర్ఫార్మెన్స్తో అదరిగొట్టేశారంతే. కీలక పాత్రలో పంకజ్ త్రిపాటి ఓ రేంజ్లో అవుట్ పుట్ ఇచ్చాడు. మొత్తంగా ఆ ఏడాది అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాల్లో ఒకటిగా స్త్రీ నిలిచింది.
ఇక అప్పటి నుంచే ఈ సినిమాకు సీక్వెల్‌ను ప్లాన్ చేస్తున్నారు. కానీ కుదర్లేదు. ఇక ఈ ఏడాదికి సీక్వెల్‌కు మోక్షం కుదిరింది. రెండు నెలల కిందట అధికారిక ప్రకటన వచ్చిన ఈ సినిమా సోమవారం షూటింగ్‌ను ప్రారంభించింది. ఈ మేరకు రాజ్‌కుమార్ రావు, శ్రద్ధా కపూర్ సెట్లో తీసుకున్న సెల్ఫీ తెగ వైరల్ అవుతుంది. ఈ మేరకు ఈ ఇద్దరు సెలబ్రెటీలు తమ తమ సోషల్ మీడియాలో సెల్ఫీ ఫోటోను మీడియాలో పంచుకున్నారు. డిసెంబర్ వరకు బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్‌తో బిజీగా చిత్రబృందం గడపనున్నట్లు తెలుస్తుంది. వీఎఫ్ఎక్స్, మిగితా ప్యాచ్ వర్క్ కోసం నాలుగైదు నెలలు టైమ్ తీసుకోనుందని టాక్.
వచ్చే ఏడాది ఆగస్టు 31న ఈ సినిమా రిలీజ్ కాబోతుందని ఇదివరకే నిర్మాత దినేష్ విజన్ అనౌన్స్ చేశాడు. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించినున్న ఈ సినిమా తొలిపార్టు మధ్యప్రదేశ్‌లోని చండేరి అనే చిన్న టౌన్ నేపథ్యంలో జరిగింది. ఇప్పుడు కూడా ఇదే ఊరును బేస్ చేసుకుని సీక్వెల్‌ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

