Rajeev Kanakala | ‘డ్రాగన్’తో ఎన్టీఆర్ అభిమానులు రెండు కాలర్లు ఎగరేయడం ఖాయం.. రాజీవ్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు!
Rajeev Kanakala | యంగ్ టైగర్ ఎన్టీఆర్, నటుడు రాజీవ్ కనకాల మధ్య ఉన్న స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ కెరీర్ ప్రారంభం నుంచి వీరిద్దరి మధ్య మంచి అనుబంధం కొనసాగుతోంది.
Rajeev Kanakala | యంగ్ టైగర్ ఎన్టీఆర్, నటుడు రాజీవ్ కనకాల మధ్య ఉన్న స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ కెరీర్ ప్రారంభం నుంచి వీరిద్దరి మధ్య మంచి అనుబంధం కొనసాగుతోంది. ఇద్దరూ తమ స్నేహం గురించి గతంలో పలుమార్లు మాట్లాడుకున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ‘డ్రాగన్’ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజీవ్.. ఎన్టీఆర్‌తో తన స్నేహం గురించి, ‘డ్రాగన్’ సినిమా విశేషాల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
ఎన్టీఆర్‌తో తనకున్న స్నేహం గురించి రాజీవ్ కనకాల మాట్లాడుతూ.. తారక్‌కు ఎప్పుడైనా బోర్ కొడితే తనకు ఫోన్ చేసి రమ్మని పిలుస్తాడని చెప్పారు. ఎన్టీఆర్ బ్యాచిలర్‌గా ఉన్న సమయంలో ఇద్దరూ తరచూ కలుసుకునేవారమని గుర్తు చేసుకున్నారు. అయితే పెళ్లి, పిల్లలు అయిన తర్వాత కలుసుకోవడం కొంత తగ్గిందన్నారు. తరచూ కలవకపోయినా తమ మధ్య ఉన్న స్నేహం మాత్రం అలాగే ఉందని తెలిపారు. చివరిసారిగా ఏడాది క్రితం ఎన్టీఆర్ ఇంట్లో కలిశానని, ఆ తర్వాత పెద్దగా కలిసే అవకాశం రాలేదని చెప్పారు. అయితే ప్రస్తుతం ‘డ్రాగన్’ సినిమాలో కలిసి నటిస్తుండటంతో షూటింగ్ సెట్లో కలుస్తున్నామని వెల్లడించారు. తమ ఇద్దరి మధ్య ఉండే అనుబంధాన్ని వివరిస్తూ.. ‘నాది, ఎన్టీఆర్‌ది రాక్షస ప్రేమ. మేము మాట్లాడుకుంటే కూడా తిట్టుకున్నట్లుగానే ఉంటుంది’ అంటూ సరదాగా వ్యాఖ్యానించారు.
ఇక ‘డ్రాగన్’ సినిమా గురించి రాజీవ్ కనకాల మాట్లాడుతూ దర్శకుడు ప్రశాంత్ నీల్‌పై ప్రశంసలు కురిపించారు. ఆయన అద్భుతమైన దర్శకుడని, ఏం కావాలో స్పష్టంగా చెప్పి నటీనటుల నుంచి అనుకున్న నటనను రాబట్టుకుంటారని అన్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం ఎనిమిది రోజుల పాటు షూటింగ్లో పాల్గొన్నానని, తన పాత్రకు సంబంధించిన మరికొంత షూటింగ్ మిగిలి ఉందని చెప్పారు. వచ్చే నెలలో మళ్లీ చిత్రీకరణ ప్రారంభం కానుందని వెల్లడించారు. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో వస్తున్న ఈ సినిమా ఒక అణుబాంబులా ఉంటుందని రాజీవ్ అభివర్ణించారు. ‘ఓపెన్‌హైమర్’ స్థాయిలో భారీ ప్రభావం చూపించే చిత్రంగా ఉంటుందని ఆసక్తికరంగా చెప్పారు. అభిమానులు ఈ సినిమా చూసిన తర్వాత ఒక కాలర్ కాదు.. రెండు కాలర్లు ఎగరేసేలా ఉంటుందని వ్యాఖ్యానించారు. రాజీవ్ కనకాల చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajeev Kanakala | ‘డ్రాగన్’తో ఎన్టీఆర్ అభిమానులు రెండు కాలర్లు ఎగరేయడం ఖాయం.. రాజీవ్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు!
Traffic Challan | ఫుట్‌పాత్‌పై బైక్ నడిపితే రూ.5 వేలు.. వన్‌వేలో వెళ్తే రూ.10 వేల ఫైన్? బెంగళూరులో కఠినంగా ట్రాఫిక్ రూల్స్!!
Bigg Boss 10 | త్రిగుణ్‌కు అదిరిపోయే గిఫ్ట్.. ముఖేష్, వంశీ మధ్య తీవ్ర వాగ్వాదం
Census 2027 | దేశవ్యాప్తంగా జనగణనకు ముహూర్తం ఖరారు.. జనవరి 25 నుంచి ఇంటింటికీ లెక్కింపు!
Aurangzeb Tomb | ఔరంగజేబు సమాధి తొలగింపునకు డెడ్‌లైన్ ఫిక్స్.. సంచలన ప్రకటన చేసిన మహారాష్ట్ర మంత్రి!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

