Rakasa | నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ టాప్ 10లో ‘రాకాస’.. తెలుగు సినిమాకు మరో అంతర్జాతీయ గుర్తింపు
Rakasa | టాలీవుడ్ నుంచి ఇటీవల వచ్చిన హారర్ ఫాంటసీ కామెడీ చిత్రం ‘రాకాస’ ఇప్పుడు ఓటీటీలో సెన్సేషన్ సృష్టిస్తోంది. థియేటర్లలో మంచి మౌత్ టాక్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా.. ఇప్పుడు ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతూ మరో అరుదైన ఘనతను సాధించింది.
Rakasa | టాలీవుడ్ నుంచి ఇటీవల వచ్చిన హారర్ ఫాంటసీ కామెడీ చిత్రం ‘రాకాస’ ఇప్పుడు ఓటీటీలో సెన్సేషన్ సృష్టిస్తోంది. థియేటర్లలో మంచి మౌత్ టాక్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా.. ఇప్పుడు ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతూ మరో అరుదైన ఘనతను సాధించింది. తాజాగా విడుదలైన నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ టాప్ 10 నాన్-ఇంగ్లీష్ మూవీస్ జాబితాలో ‘రాకాస’ ఏడో స్థానాన్ని దక్కించుకుంది. ఏప్రిల్ 27 నుంచి మే 3 వరకు గల వారానికి సంబంధించిన వ్యూయర్షిప్ డేటాను నెట్‌ఫ్లిక్స్ విడుదల చేయగా.. ‘రాకాస’కు మొత్తం 1.2 మిలియన్ వ్యూస్ వచ్చినట్లు ప్రకటించింది. ఈ సంఖ్యతో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వీక్షించిన ఆంగ్లేతర చిత్రాల్లో ఒకటిగా నిలవడం విశేషం.
ముఖ్యంగా తెలుగు హారర్ కామెడీ జానర్‌కు విదేశీ ప్రేక్షకుల నుంచి కూడా మంచి ఆదరణ లభిస్తోందని ఈ ఫలితాలు స్పష్టంగా చెబుతున్నాయి. యువ హీరో సంగీత్ శోభన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో హీరోయిన్గా నయన్ సారిక కనిపించారు. దర్శకురాలు మానస శర్మ తెరకెక్కించిన ఈ చిత్రం హారర్, ఫాంటసీ, కామెడీ అంశాలను కలిపి ఫ్యామిలీ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంది. థియేటర్లలో మొదట సాధారణ ఓపెనింగ్స్ వచ్చినా.. పాజిటివ్ మౌత్ టాక్ కారణంగా సినిమా క్రమంగా బలమైన వసూళ్లు సాధించింది. ఇక ఓటీటీలోకి వచ్చిన తర్వాత ‘రాకాస’కు మరింత పెద్ద స్థాయిలో రెస్పాన్స్ రావడం ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్, యువత ఈ సినిమాను విపరీతంగా వీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో కూడా సినిమాకు సంబంధించిన మీమ్స్, కామెడీ సన్నివేశాలు వైరల్ అవుతూ ఉండటం సినిమాకు మరింత ప్లస్ అయింది.
తెలుగు సినిమాలు ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిని దాటి గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్న సమయంలో ‘రాకాస’ లాంటి మిడ్ రేంజ్ సినిమాలు కూడా అంతర్జాతీయ చార్ట్స్‌లో చోటు సంపాదించడం ఇండస్ట్రీకి పెద్ద బూస్ట్‌గా మారింది. భారీ బడ్జెట్ లేదా స్టార్ క్యాస్ట్ లేకుండానే కంటెంట్ బలంగా ఉంటే ప్రపంచ ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చని ఈ సినిమా మరోసారి నిరూపించింది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై, జీస్టూడియోస్ సహకారంతో నిహారిక కొణిదెల, ఉమేష్ కుమార్ బన్సల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మంచి వినోదంతో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కలగలిపిన ‘రాకాస’ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ ట్రెండింగ్ సినిమాల్లో ఒకటిగా కొనసాగుతోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nikeelu Gunda | సూపర్ ఏఐ అకాడమీ ఫౌండర్ నికీలు గుండాకు ప్రతిష్ఠాత్మక పురస్కారం
100 Feets Master Plan Road | మేం కష్టపడి కట్టుకున్న స్కూల్ పోతుంది.. 100 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు రీఅలైన్మెంట్పై బాధిత మహిళ
NBK 112 | మ్యూజిక్ డైరెక్టర్‌పై క్లారిటీ.. అనిరుధ్, జీవీ ప్రకాష్‌లకు నో ఛాన్స్, బాలయ్య సినిమా అప్డేట్ ఇదే!
TN CM Vijay | జైలు నుంచి ఖైదీల పరారీ ఘటన.. తమిళనాడు సీఎం విజయ్ కీలక ఆదేశాలు..!
AP News | ఏపీలో దారుణం.. తరగతి గదిలో విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో నిందితుడి దాడి.. పరిస్థితి విషమం
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

