Pavala Syamala | పావలా శ్యామలకు ఆర్థిక సాయం చేసిన పూరి జగన్నాథ్ కొడుకు
Pavala Syamala | టాలీవుడ్ సీనియర్ నటి పావలా శ్యామల ఇటీవల తన ఆర్థిక పరిస్థితి బాగాలేదని సాయం చేయండంటూ వేడుకున్న సంగతి తెలిసిందే.
Pavala Syamala | రంగస్థల నటిగా ఎంట్రీ ఇచ్చి హాస్యనటి, సహాయనటిగా ఎన్నో తెలుగు చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది సీనియర్ నటి పావలా శ్యామల(Pavala Syamala). అయితే శ్యామల ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం అస్సలు బాగోలేదు. అనారోగ్య పరిస్థితులతో సినీ ఇండస్ట్రీకి దూరమైన ఆమె కష్టంగా జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తనకు సాయం చేయండి అంటూ తెలుగు సినీ ప్రముఖులను ఆమె వేడుకుంది.
అయ్యా.. 50 ఏండ్లుగా కష్టపడి నటిగా బ్రతికాను. ఈ మూడు ఏండ్ల నుంచి నా పరిస్థితి ఎలా అయ్యిందో అందరికీ తెలుసు. ఈ విషయం చాలా ఇంటర్వ్యులలో కూడా చెప్పాను. కానీ ఎవరు స్పందించలేదు. ఎలాగో ఇంతవరకు వచ్చాను. ఇప్పుడు కొన ఊపిరితో ఉన్నాను. చిరంజీవితో ప్రభాస్‌తో.. మహేశ్ బాబు, ఎన్టీఆర్ ఇలా పెద్ద పెద్ద హీరోల అందరితో చేసి.. ఆఖరికి ఆత్మహత్య చేసుకునే స్థితిలో ఉన్నాను. ట్రీట్మెంట్ చేయించుకోలేక అవస్థగా ఉన్నాను. నన్ను ఇలానే వదిలేసి ఆత్మహత్య చేసుకునేలాగా చేస్తారా.. దయచేసి తనకు సాయం చేయండంటూ శ్యామల తన ఆవేదన వ్యక్తం చేసింది.
అయితే శ్యామల పరిస్థితి తెలుసుకున్న పూరి జగన్నాథ్ (Director Puri Jaganannath) కొడుకు ఆకాశ్ జగన్నాథ్(Akash Puri) ఆమెని అర్థిక సాయాన్ని అందించాడు. ప్రస్తుతం శ్యామల ఉంటున్న ఉషా సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సోసైటీకి వెళ్లిన ఆకాశ్ శ్యామలను కలిసి ఆమె బాగోగులు తెలుసుకున్నాడు. అనంతరం లక్ష రూపాయలు చేతికి అందించి.. ఏ కష్టం వచ్చిన తాను ఉన్నానంటూ భరోసాను అందించాడు ఆకాశ్. కాగా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
A Generous Gesture from Young Hero @AkashJagannadh ❤️
Hero #AkashJagannadh personally met senior actress #PavalaSymala Garu and donated 1 lakh, promising to stand in support 👏 pic.twitter.com/pKRoYIO7ae
— Suresh PRO (@SureshPRO_) January 18, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gyanesh Kumar | జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. ఒక్కరిని కాపాడేందుకు ఎందుకీ తాపత్రయం?: కేటీఆర్
CJP Protest | జంతర్ మంతర్ 2.0తో హైఅలర్ట్.. సెంట్రల్ ఢిల్లీ లాక్డౌన్.. 57 మెట్రో స్టేషన్లు మూసివేత, ఇంటర్నెట్ సేవలు బంద్!
RTC Elections | ఫ్లాష్.. ఫ్లాష్.. ఫ్లాష్.. ఆర్టీసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు భారీ షాక్!
Voter Deletion | టార్గెట్ బీఆర్ఎస్?.. తొలగించిన ప్రతి రెండు ఓట్లలో ఒకటి బీఆర్ఎస్ నియోజకవర్గానిదే
Horoscope | 10-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

