పవన్ మహావీర్ హీరోగా పరిచయం అవుతున్న వినూత్న ప్రేమకథాచిత్రం ‘అమ్మా.. నాకు ఆ అబ్బాయి కావాలి’. వర్షిక, సుహానా హీరోయిన్లు. శివాల ప్రభాకర్ దర్శకుడు. శైలజారెడ్డి నిర్మాత. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్ రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఏపీ ఎఫ్డీసీ ఛైర్మన్ భరత్‌భూషణ్, టి.ప్రసన్నకుమార్, వల్లభనేని అనిల్, కె.అశోక్‌కుమార్, వీఎన్ ఆదిత్య, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, జర్నలిస్ట్ ప్రభు, సురేశ్ కొండేటి ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు.
ఈ చిత్ర నిర్మాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ నిర్మాత శైలజారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. నిర్మాతగా శైలజారెడ్డికీ, హీరోగా పవన్ మహావీర్కీ ఉజ్వలమైన భవిష్యత్ ఉందని దర్శకుడు శివాల ప్రభాకర్ పేర్కొన్నారు. ఈ చిత్రంలో భాగం కావడం పట్ల హీరోయిల్లిద్దరూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి కెమెరా: మహేందర్.ఎం, సంగీతం: సాయికార్తీక్.