Prajwal | సుమకే షాకిచ్చిన చిన్నారి ప్రజ్వల్.. త్రివిక్రమ్, వెంకటేశ్ పంచులతో ప్రీ రిలీజ్ వేడుకలో నవ్వుల సందడి!
Prajwal | సాధారణంగా ఈవెంట్లలో యాంకర్ సుమ కనకాల తనదైన చమత్కారాలతో సెలబ్రిటీలకు కౌంటర్లు వేయడం చూస్తూనే ఉంటాం. స్టార్ హీరోల నుంచి అతిథుల వరకు అందరినీ తన మాటలతో నవ్వించే సుమకు తాజాగా ఓ చిన్నారి గట్టి షాక్ ఇచ్చాడు. ‘ఆదర్శ కుటుంబం’ ప్రీ రిలీజ్ వేడుకలో బాలనటుడు రాజా ప్రజ్వల్ వేసిన పంచ్‌లకు సుమతో పాటు అక్కడున్న వారంతా నవ్వుల్లో మునిగిపోయారు.
Prajwal | సాధారణంగా ఈవెంట్లలో యాంకర్ సుమ కనకాల తనదైన చమత్కారాలతో సెలబ్రిటీలకు కౌంటర్లు వేయడం చూస్తూనే ఉంటాం. స్టార్ హీరోల నుంచి అతిథుల వరకు అందరినీ తన మాటలతో నవ్వించే సుమకు తాజాగా ఓ చిన్నారి గట్టి షాక్ ఇచ్చాడు. ‘ఆదర్శ కుటుంబం’ ప్రీ రిలీజ్ వేడుకలో బాలనటుడు రాజా ప్రజ్వల్ వేసిన పంచ్‌లకు సుమతో పాటు అక్కడున్న వారంతా నవ్వుల్లో మునిగిపోయారు. దీనికి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, హీరో వెంకటేశ్ కూడా తోడవడంతో ఈ కార్యక్రమం మరింత సందడిగా మారింది. ఈ సరదా సంభాషణకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారుతోంది.
వెంకటేశ్ కథానాయకుడిగా, శ్రీనిధి శెట్టి కథానాయికగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆదర్శ కుటుంబం’. ఈ సినిమా ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికపై నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా బాలనటుడు రాజా ప్రజ్వల్‌తో ఆమె సరదాగా మాట్లాడారు. మాటల మధ్యలో ప్రజ్వల్ అమాయకంగా సుమను ఉద్దేశించి.. “మీరు ఎప్పుడు పుట్టారు?” అని అడిగాడు. దీనికి సుమ తనదైన శైలిలో స్పందిస్తూ.. “నేను ‘మల్లీశ్వరి’ టైంలో పుట్టాను” అని చెప్పారు. అయితే ఆమె వెంకటేశ్ నటించిన ‘మల్లీశ్వరి’ సినిమాను ఉద్దేశించి ఆ మాట అనగా, ప్రజ్వల్ వెంటనే “మన భానుమతి గారి ‘మల్లీశ్వరి’నా?” అంటూ ఊహించని కౌంటర్ ఇచ్చాడు.
1951లో విడుదలైన క్లాసిక్ చిత్రం ‘మల్లీశ్వరి’ని గుర్తుచేస్తూ చిన్నారి వేసిన పంచ్‌తో వేదికపై నవ్వులు వెల్లివిరిశాయి. ఒక్కసారిగా షాక్‌కు గురైన సుమ.. నవ్వుతూనే “గెట్ ఔట్” అంటూ ప్రజ్వల్‌ను సరదాగా పక్కకు పంపించారు. సాధారణంగా ఇతరులకు కౌంటర్లు ఇచ్చే సుమకే ఈసారి చిన్నారి నుంచి ఊహించని సమాధానం ఎదురవడంతో ఈ ఘట్టం అందరినీ ఆకట్టుకుంది. ఇక్కడితో ఈ సరదా సంభాషణ ఆగలేదు. కింద కూర్చున్న దర్శకుడు త్రివిక్రమ్ మైక్ అందుకుని సుమను మరింత ఆటపట్టించారు. “రేయ్ ప్రజ్వల్.. భవిష్యత్తులో నీకు పుట్టే కొడుకు కూడా ఇక్కడికి వచ్చి ఆడుకుంటుంటాడు. అప్పుడు కూడా ఈవిడ ఇక్కడే కూర్చుని చూస్తుంటుంది” అంటూ సుమ సుదీర్ఘ యాంకరింగ్ ప్రయాణాన్ని ఉద్దేశించి చమత్కరించారు.
త్రివిక్రమ్ వ్యాఖ్యలకు సుమ కూడా సరదాగా స్పందించారు. తన గతం గురించి మరీ ఎక్కువగా మాట్లాడొద్దంటూ నవ్వుతూ చెప్పినా, దర్శకుడు మాత్రం ఆమెను ఆటపట్టించడం కొనసాగించారు. “నాకంటే నువ్వు చిన్నదానివే” అంటూ మరో మాట అనడంతో వేదికపై నవ్వులు మరింత పెరిగాయి.దీంతో సుమ తెలివిగా మాటను మరోవైపు మళ్లించారు. అక్కడున్న వారిలో నటుడు బ్రహ్మాజీ మాత్రమే తనకంటే పెద్దవారని చెబుతూ చర్చను ఆయనవైపు మళ్లించే ప్రయత్నం చేశారు. ఇలా సుమ, త్రివిక్రమ్ మధ్య జరిగిన సరదా మాటల యుద్ధం వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ నవ్వుల సందడి ముగియకముందే మరో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. శ్రేయాస్ మీడియా శ్రీనివాస్‌గారి కారు తాళాలు కనిపించడం లేదని సుమ వేదికపై ప్రకటించారు. వెంటనే స్పందించిన వెంకటేశ్.. “రేయ్ ప్రజ్వల్.. ఇచ్చేయ్ రా.. నాకు తెలుసు నీ సంగతి. ఇచ్చేయ్” అంటూ సరదాగా పిలిచారు. అందరూ ఆశ్చర్యంగా చూస్తుండగానే ప్రజ్వల్ తన జేబులో నుంచి కారు తాళాలను తీసి ఇచ్చారు.. దీంతో అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారు. ఈ సందర్భంగా వెంకటేశ్ నవ్వుతూ.. మావాడు అంతే.. మ్యాజిక్ చేస్తాడు. ఇవాళ అందరూ కొంచెం జాగ్రత్తగా ఉండండి అని అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prajwal | సుమకే షాకిచ్చిన చిన్నారి ప్రజ్వల్.. త్రివిక్రమ్, వెంకటేశ్ పంచులతో ప్రీ రిలీజ్ వేడుకలో నవ్వుల సందడి!
Tirumala | తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
Cyclone Arnab | అర్నబ్ తుపాను ఎఫెక్ట్.. అనంతగిరిలో కొట్టుకుపోయిన వంతెనలు..!
ఖమ్మం జిల్లాపై ‘అర్నబ్’ తుపాను ప్రభావం.. జిల్లా వ్యాప్తంగా మోస్తరు వర్షం
Ramya Krishna | తమిళ బిగ్‌బాస్ హోస్ట్‌గా రమ్యకృష్ణ.. ఒక్క ఎపిసోడ్‌కు ఎంత పారితోషికమంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

