Spirit Shoot | ‘స్పిరిట్’ సెట్స్‌లోకి ప్రభాస్ అడుగుపెట్టేది అప్పుడే.!
Prabhas | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, అర్జున్ రెడ్డి, యానిమల్ చిత్రాల దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా కాంబోలో రాబోతున్న ప్రాజెక్ట్ ‘స్పిరిట్’(Spirit).
Prabhas – Sandeep Reddy Vanga | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, అర్జున్ రెడ్డి, యానిమల్ చిత్రాల దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా కాంబోలో రాబోతున్న ప్రాజెక్ట్ ‘స్పిరిట్’(Spirit). భారీ బడ్జెట్‌తో రానున్న ఈ మూవీని టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ నిర్మించనుండగా.. ప్రస్తుతం ప్రీ ప్రోడక్షన్ పనులు జరుపుకుంటుంది ఈ చిత్రం అయితే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి అప్డేట్స్ కోసం ప్రభాస్ అభిమానులంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఒక అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ ఏడాది చివరిలో ‘స్పిరిట్’ సెట్స్ మీదకి వెళ్లనున్నట్లు టాక్ నడుస్తున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి మరో అప్డేట్ వచ్చింది. ప్రభాస్ ప్రస్తుతం ఉన్న ప్రాజెక్ట్‌లను పూర్తి చేసిన తర్వాతే సందీప్ రెడ్డి స్పిరిట్‌లో జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తుంది. స్పిరిట్ షూటింగ్ మొత్తం 120 రోజులకు పైగా జరగనుందని, అందులో 90 రోజులకు పైగా ప్రభాస్ పాల్గొననున్నారని సమాచారం. ఈ సినిమా కోసం ప్రభాస్ జిమ్‌లో తీవ్రంగా వర్కవుట్ చేస్తూ కొత్త లుక్‌ను సిద్ధం చేస్తున్నారట. ఇప్పటివరకూ చూడని ప్రత్యేకమైన లుక్‌లో ఆయన ఈ చిత్రంలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.
ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి తాజాగా అమెరికాలో జరిగిన ఓ కార్యక్రమంలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ.. స్పిరిట్ సినిమా షూటింగ్‌ను మెక్సికోలో జరుపబోతున్నట్లు ప్రకటించాడు. ఇంతకంటే ఏం అప్డేట్ ఇవ్వలేమని తెలిపాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

