Prabhas | మిస్టర్ పర్ఫెక్ట్, సంతోషం సినిమాలతో డైరెక్టర్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు దశరథ్ (Dasaradh). రైటర్ కమ్ డైరెక్టర్గా ప్రభాస్ (Prabhas)తో దశరథ్ తెరకెక్కించిన మిస్టర్ పర్ఫెక్ట్ మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సీనియర్ దర్శకుడు ఇప్పుడు నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యాడు. లవ్ యూ రామ్ సినిమాతో నిర్మాతగా మారారు దశరథ్. ఈ సందర్భంగా ఆయనకు విషెస్ తెలియజేశాడు ప్రభాస్.
దశరథ్గారు నాకు సూపర్ హిట్ సినిమా మిస్టర్ పర్ఫెక్ట్ ఇచ్చిన దర్శకుడు. ఆయన ఫైనల్గా నిర్మాతగా మారారు. సినిమా పేరు లవ్ యూ రామ్ (Love You Ram ). దశరథ్పై నాకు చాలా నమ్మకముంది. ఆయన సినిమా చేస్తున్నారంటే ఏదో ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ అయి ఉంటుంది. సినిమా టీంకు, దశరథ్కు ఆల్ ది బెస్ట్. సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నానని వీడియో సందేశాన్ని పోస్ట్ చేశాడు ప్రభాస్. ఇప్పుడీ వీడియో నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.
రోహిత్ బెహల్, అపర్ణా జనార్దనన్ నటిస్తోన్న లవ్ యూ రామ్ జూన్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ప్రభాస్ వీడియో సందేశం ఇలా..
Global Star @PrabhasRaju expresses his love for @directordasarad & wishes the team #LoveYouRam a BIG Blockbuster ♥️💥
Watch #LoveYouRamOnJune30 Only In Theaters 🍿🥳@RohitBehal77 @AparnaJan @DYChowdary1 @vedakondapalli #ManaEntertainment @SriChakraFilms_@adityamusic pic.twitter.com/60EmXUh4pw
— Love You Ram (@LoveYouRamMovie) June 27, 2023