Prabhas: ప్రభాస్ కోసం హాలీవుడ్ కథ రెడీ.. సెట్స్‌పైకి ఎప్పుడు వెళ్లనుందో..!

బాహుబలి తర్వాత తన క్రేజ్‌ని అమాంతం పెంచుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ సినిమాను కంప్లీట్ చేశాడు ప్రభాస్. ఈ సినిమా పిరియాడికల్ లవ్ డ్రామాగా తెరకెక్కింది. ఈ మూవీలో బుట్టబొమ్మ పూజ ప్రభాస్‌తో రొమాన్స్ చేయనుంది. అలాగే ఈ సినిమా తర్వాత వెంటనే సలార్ సెట్లో అడుగు పెట్టాడు ప్రభాస్.
ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న సలార్ సినిమాలో డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులకు గుజ్బంప్స్ తెప్పించింది. ఈ సినిమాతోపాటుగా ఆదిపురుష్ సినిమాను కూడా కానిచేస్తున్నాడు . ఈ సినిమాల తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కె ప్రాజెక్ట్ చేయనున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.
అయితే ప్రభాస్‌ను హాలీవుడ్లో లాంచ్ చేసేందుకు రంగం సిద్దం చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఒక నిర్మాణ సంస్థ ప్రభాస్‌తో ఒక హై బడ్జెట్ సినిమాని ప్లాన్ చేయాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. ఇది హారర్ స్టోరీ అని తెలుస్తుండగా, ఇందుకు ప్రభాస్ ఓకే చెబుతాడా లేదా అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. సాధారణంగా ప్రభాస్‌కి హారర్ కథలు నచ్చవు. మరి హాలీవుడ్ ప్రాజెక్ట్‌కి ఓకే చెబుతాడా అనేది చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

