Prabhas | ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. ‘స్పిరిట్’ సెట్స్ నుంచి సందీప్ రెడ్డి వంగా సర్ప్రైజ్ పోస్ట్
Prabhas | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తమ అభిమాన హీరో పుట్టినరోజు కావడంతో ప్రభాస్ కొత్త సినిమాల నుంచి ఏదైనా ప్రత్యేక ప్రకటన వస్తుందేమోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Prabhas | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తమ అభిమాన హీరో పుట్టినరోజు కావడంతో ప్రభాస్ కొత్త సినిమాల నుంచి ఏదైనా ప్రత్యేక ప్రకటన వస్తుందేమోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ క్రమంలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అభిమానులకు ఓ ప్రత్యేక సర్ప్రైజ్ ఇచ్చారు. ప్రభాస్‌తో కలిసి ‘స్పిరిట్’ సినిమా సెట్స్‌లో దిగిన ఫొటోను పంచుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రభాస్‌తో సందీప్ రెడ్డి వంగా కలిసి ఉన్న ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో సందీప్ రెడ్డి వంగా చేతిలో మందు బాటిల్ పట్టుకుని ఉండగా, ప్రభాస్ నవ్వుతూ దానిని చూపిస్తూ ఆయనతో మాట్లాడుతున్నట్లు కనిపిస్తున్నారు. ఈ ఫొటోను పంచుకున్న సందీప్ రెడ్డి వంగా.. ‘‘అన్నా.. లెట్స్ పార్టీ! ఇవాళ నీ పుట్టినరోజు. పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రభాస్ అన్నా’’ అంటూ తన అభిమానాన్ని చాటుకున్నారు.ప్రభాస్‌తో సందీప్‌కు ఉన్న సాన్నిహిత్యాన్ని ఈ ఫొటో ప్రతిబింబిస్తోందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. తమ అభిమాన హీరో పుట్టినరోజున దర్శకుడు పంచుకున్న ఈ ప్రత్యేక ఫొటోను విపరీతంగా షేర్ చేస్తున్నారు.
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కలయికలో తెరకెక్కనున్న ‘స్పిరిట్’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ వంటి చిత్రాలతో తనదైన శైలిని చాటుకున్న సందీప్.. ప్రభాస్‌ను ఏ తరహా పాత్రలో చూపించబోతున్నారనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ఈ సినిమా నుంచి ఏదైనా కొత్త సమాచారం వస్తుందేమోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమా ప్రకటనల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో సందీప్ రెడ్డి వంగా పంచుకున్న ఈ ఫొటో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీంతో ‘స్పిరిట్’కు సంబంధించిన మరిన్ని వివరాలు ఎప్పుడు బయటకు వస్తాయా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. ‘స్పిరిట్’ సెట్స్ నుంచి సందీప్ రెడ్డి వంగా సర్ప్రైజ్ పోస్ట్
Haiku Movie | ‘హైకూ’ మూవీ రివ్యూ.. యూత్ ఫుల్ లవ్ ఎమోషన్స్‌తో ఆకట్టుకునే జెన్ జీ ప్రేమకథ!
వేయిస్తంభాల గుడి సుందరీకరణకు ప్రజలు సహకరించాలి : మున్సిపల్ కమిషనర్ వెంకన్న
Speaker Sets Deadline | టీవీకేలో చేరిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణకు.. గడువు విధించిన స్పీకర్
Tiger Shroff | నేరస్థులను చూస్తే నవ్వొస్తుంది.. టైగర్ ష్రాఫ్ ఘటనపై ఆర్జీవీ రియాక్షన్
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

