రాజమౌళి మాకు మార్గం చూపారు
విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చారిత్రక చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’. మణిరత్నం దర్శకుడు. పాన్ ఇండియా స్థాయిలో లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంస్థలు నిర్మించాయి. రెండు భాగాలుగా తెరకెక్కించారు. తొలిభాగం సెప్టెంబర్ 30న విడుదలకానుంది. ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాత దిల్‌రాజు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సినిమాలోని ‘చోళ చోళ’ అనే పాటను శుక్రవారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఏ.ఆర్.రెహమాన్ స్వరకర్త. ఈ సందర్భంగా మణిరత్నం మాట్లాడుతూ ‘ఈ సినిమా విషయంలో ముందుగా రాజమౌళిగారికి థాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి భారీ చిత్రాలు తీయడానికి ఆయనే మాకు మార్గం చూపారు. రెండు భాగాలుగా సినిమా తీసి మెప్పించవొచ్చని ‘బాహుబలి’తో నిరూపించారు. ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్న దిల్‌రాజుగారికి కృతజ్ఞతలు’ అన్నారు. విక్రమ్ మాట్లాడుతూ ‘నాకు మణిసార్‌తో ప్రత్యేకమైన అనుబంధం ఉంది.
‘రావణ్’ తర్వాత ఆయనతో చేస్తున్న చిత్రమిది. ఈ సినిమాలో నటించడంతో ఓ అద్భుతమైన కల నిజమైందనే భావన కలిగింది’ అని చెప్పారు. కార్తి మాట్లాడుతూ ‘ 1955లో ‘పొన్నియన్ సెల్వన్’ నవల పబ్లిష్ అయింది. ఎంతోమంది ఆ నవలను సినిమా తీయాలనుకున్నారు. అరవై ఏళ్ల తర్వాత ఈ కల సాకారమైంది. ఈ నవలలో ఐదు ప్రధాన పాత్రలుంటాయి. అడ్వెంచరస్ జర్నీగా, విజువల్ వండర్‌గా ఈ సినిమా ఆకట్టుకుంటుంది. వెయ్యేళ్ల క్రితం జరిగిన ఓ చారిత్రక కథను కళ్లకుకట్టినట్లుగా ఆవిష్కరిస్తుంది’ అన్నారు. తనికెళ్ల భరణి మాట్లాడుతూ ‘ఇరవై ఐదేళ్ల తర్వాత మళ్లీ ఈ సినిమా కోసం మాటలు రాశాను. అందుకు కారణం మణిరత్నంగారే. ఒకప్పుడు ‘దళపతి’ సినిమాలో చిన్న పాత్ర చేసే అవకాశం మిస్సయింది.
ఈ రోజు అదే మణిరత్నం సినిమాకు మాటలు రాయడం అదృష్టంగా భావిస్తున్నా’ అన్నారు. ప్రకాష్‌రాజ్ మాట్లాడుతూ ‘దాదాపు అరవై సంవత్సరాలుగా తమిళ జనబాహుళ్యంలో విస్త్రతంగా ప్రచారంలో ఉన్న కథ ఇది. మణిరత్నంగారు దశాబ్దకాలంగా ఈ సినిమాను దృశ్యమానం చేయాలని తపిస్తున్నారు. ఇండియాలోని ప్రతిభావంతులైన నటులు ఈ సినిమాలో భాగమయ్యారు’ అని తెలిపారు. దిల్‌రాజు మాట్లాడుతూ ‘ ప్రస్తుతం మంచి కంటెంట్‌తో సినిమాలు చేస్తే భాషాభేదాలకు అతీతంగా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. తెలుగు ప్రేక్షకులకు కూడా చోళ రాజుల కథ గురించి తెలుసు కాబట్టి ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని నమ్ముతున్నా’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Books Launch | తెలుగు సాహితీ వికాస వేదిక ఆధ్వర్యంలో ఘనంగా పుస్తకాల ఆవిష్కరణ
Gold in Rapido | ర్యాపిడోలో బంగారం పంపిస్తే.. ఆభరణాలతో ఉడాయించిన డ్రైవర్!
‘విద్యార్థులను శాస్త్రవేత్తలుగా తయారు చేయడంలో సైన్స్ కాంగ్రెస్ దోహదం’
కోదాడలో 120 కేజీల గంజాయి పట్టివేత
Beauty Tips | ముఖంపై మొటిమలు ఇబ్బంది పెడుతున్నాయా.. అయితే సింపుల్ టిప్స్ ట్రై చేయండి..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

