చంద్రశేఖర్, సోనాలి పాణిగ్రాహి జంటగా నటిస్తున్న చిత్రం ‘ప్లాంట్ మ్యాన్’. కె.సంతోష్‌బాబు దర్శకుడు. పన్నా రాయల్ నిర్మాణ బాధ్యతలు చేపట్టడంతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నారు. ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సినిమాలోని ‘కన్నమ్మ..చిట్టి గుండెలోన దాచలేని గోలమ్మ’ అనే లిరికల్ వీడియోను ఇటీవల విడుదల చేశారు.
ఆనంద్ బాలాజీ స్వరపరచిన ఈ పాటను హేమకాంత్ రచించారు. నిర్మాత పన్నా రాయల్ మాట్లాడుతూ ‘ఇదొక సైంటిఫిక్ కామెడీ ఎంటర్టైనర్. ఇప్పటి వరకు తెలుగులో రానటువంటి కాన్సెప్ట్‌తో తెరకెక్కిస్తున్నాం. ఆద్యంతం చక్కటి వినోదంతో ఆకట్టుకుంటుంది. కుటుంబమంతా కలిసి ఆస్వాదించే విధంగా ఉంటుంది’ అన్నారు. అశోక్ వర్ధన్, యాదం రాజు, అప్పారావు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: పి.ఎస్.మణికర్ణన్, సంగీతం: ఆనంద బాలాజీ.