కంచర్ల ఉపేంద్ర, సావిత్రి జంటగా నటిస్తున్న చిత్రం ‘ఉపేంద్రగాడి అడ్డా’. ఆర్యన్ సుభాన్ ఎస్.కె దర్శకుడు. కంచర్ల అచ్యుత రావు నిర్మాత. ఈ చిత్ర టీజర్‌ను ఇటీవల విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే చిత్రమిది. సోషల్‌మీడియాను మంచి మార్గంలో ఉపయోగించుకుంటే సమాజం మరింత అభివృద్ధి చెందుతుందనే సందేశం ఉంటుంది’ అన్నారు.
షూటింగ్ మొత్తం పూర్తయిందని, ఈ నెల 29న ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నామని నిర్మాత కంచర్ల అచ్యుతరావు తెలిపారు. నటనపై తనకున్న ఆసక్తిని తెలుసుకొని తన తండ్రి ఐదు సినిమాలను నిర్మించడం అదృష్టంగా భావిస్తున్నానని హీరో కంచర్ల ఉపేంద్ర పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: రవీందర్సన్, సంగీతం: రాము అద్దంకి, మాటలు: శ్రీనివాస్‌తేజ, దర్శకత్వం: సుభాన్ ఎస్.కె.