Peddi Trailer | ‘పెద్ది’ ట్రైలర్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభం.. స్పెషల్ అప్డేట్ ఇచ్చిన రామ్ చరణ్
Peddi Trailer | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం పెద్దిపై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. దర్శకుడు బుచ్చిబాబు సన తెరకెక్కిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామా చిత్రం ఇప్పటికే ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తిని సృష్టించింది. విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, పాటలు సినిమాపై భారీ హైప్ తీసుకొచ్చాయి. ఇప్పుడు అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న అంశం పెద్ది ట్రైలర్.
Peddi Trailer | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం పెద్దిపై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. దర్శకుడు బుచ్చిబాబు సన తెరకెక్కిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామా చిత్రం ఇప్పటికే ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తిని సృష్టించింది. విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, పాటలు సినిమాపై భారీ హైప్ తీసుకొచ్చాయి. ఇప్పుడు అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న అంశం పెద్ది ట్రైలర్. ఈ ట్రైలర్ విడుదల కోసం సినీ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సమయంలో చిత్రబృందం మరో భారీ అప్డేట్ ఇచ్చింది. ఇప్పటికే ముంబైలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు ప్రకటించిన మేకర్స్, తాజాగా ఈ ఈవెంట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించారు.
ఈ సందర్భంగా రామ్ చరణ్ స్వయంగా ఓ ప్రత్యేక గ్లింప్స్ ద్వారా అభిమానుల్లో మరింత ఉత్సాహం నింపారు. “ఇప్పటివరకు మీరు పాటలు, గ్లింప్స్ చూశారు.. ఇక ఇప్పుడు అసలు బ్లాస్ట్ చూడబోతున్నారు” అంటూ అభిమానుల్లో ఆసక్తిని పెంచేలా రామ్ చరణ్ సందేశం ఇచ్చారు. ఈ మాటలతో సోషల్ మీడియాలో పెద్ది ట్రైలర్‌పై చర్చలు మరింత పెరిగిపోయాయి. ముంబైలోని జియో వరల్డ్ డ్రైవ్ వేదికగా ఈ గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగనుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి కార్యక్రమం ప్రారంభం కానున్నట్లు సమాచారం. భారీ స్థాయిలో అభిమానులు, సినీ ప్రముఖులు పాల్గొనే అవకాశమున్న ఈ ఈవెంట్‌పై ఇప్పుడు ప్రత్యేక ఆసక్తి నెలకొంది.
స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతుందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌లో గ్రామీణ నేపథ్యంలో కనిపించిన చరణ్ లుక్ అభిమానులను ఆకట్టుకుంది. ఇక ఈ చిత్రానికి ఆస్కార్ విజేత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఆయన అందించిన పాటలకు ఇప్పటికే మంచి స్పందన లభించింది. అలాగే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు ప్రత్యేక బలంగా నిలుస్తుందని చిత్రబృందం భావిస్తోంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ నిర్మిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న పెద్ది జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ట్రైలర్ విడుదలతో సినిమా అంచనాలు మరింత పెరుగుతాయా? అభిమానులు ఆశిస్తున్న స్థాయిలో ఈ ట్రైలర్ ఉండబోతుందా? అన్న ఆసక్తి ఇప్పుడు అందరిలో కనిపిస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

