Pawan Kalyan | పవన్ కళ్యాణ్ సినిమా ఫీవర్… వెయ్యి కేజీల పేపర్లతో థియేటర్లో రచ్చ చేసేందుకు రెడీ..!
Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే తెలుగు రాష్ట్రాల్లో ఫెస్టివల్ మూడ్ వచ్చేసినట్టే. టాలీవుడ్లో స్టార్ హీరోలెందరికో అభిమానులు ఉన్నా, పవన్ ఫ్యాన్స్ క్రేజ్ మాత్రం ఎప్పుడూ స్పెషల్. రాజకీయాల్లో బిజీ అయ్యాక సినిమాలు తగ్గించినా, ఆయన మీద ఫ్యాన్స్‌కు ఉన్న ప్రేమ మాత్రం ఎక్కడా తగ్గలేదు.
Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే తెలుగు రాష్ట్రాల్లో ఫెస్టివల్ మూడ్ వచ్చేసినట్టే. టాలీవుడ్లో స్టార్ హీరోలెందరికో అభిమానులు ఉన్నా, పవన్ ఫ్యాన్స్ క్రేజ్ మాత్రం ఎప్పుడూ స్పెషల్. రాజకీయాల్లో బిజీ అయ్యాక సినిమాలు తగ్గించినా, ఆయన మీద ఫ్యాన్స్‌కు ఉన్న ప్రేమ మాత్రం ఎక్కడా తగ్గలేదు. పవన్ కళ్యాణ్ 2023లో ‘బ్రో’తో చివరిసారి ప్రేక్షకులను పలకరించగా, ఇప్పుడు దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత హరిహర వీరమల్లుతో రాబోతున్నారు. ఇది ఆయన తొలి పాన్ ఇండియా సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ గురువారం రిలీజ్ కానున్న ఈ చిత్రం కోసం తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు టిక్కెట్ ధరలు పెంపు, ప్రీమియర్ షోలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఫ్యాన్స్‌కి ఆనందానికి అవధులే లేవు.
ఇప్పటికే థియేటర్లు ఫ్లెక్సీలు, కటౌట్లతో కళకళలాడుతున్నాయి. థియేటర్ల వద్ద వేడుకల కోసం ఫ్యాన్స్ ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు. హైదరాబాద్‌లోని కూకట్పల్లి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఏకంగా 1000 కేజీల పేపర్లు సిద్ధం చేశారు. ప్రీమియర్ షో జరుగనున్న విశ్వనాథ్ థియేటర్లో షో ప్రసారం అయ్యే సమయంలో వాటిని విసిరివేసేందుకు పేపర్స్‌ని మిషన్ సాయంతో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఒక్క కూకట్‌పల్లిలోనే కాదు,హైదరాబాద్ నలుమూలలా పవన్ ఫ్యాన్స్ సందడి మొదలైపోయింది. అయితే పాత న్యూస్‌పేపర్లు, బ్యానర్లు దొరకడం ఇప్పుడు కాస్త కష్టంగా మారిందని పలువురు చెబుతున్నారు.
ఇక సినిమా విడుదలకు 24 గంటలు కూడా లేకపోవడంతో ఫ్యాన్స్ థియేటర్లవద్ద భారీ స్థాయిలో ప్లాన్లతో రెడీ అయ్యారు. పవన్ కళ్యాణ్ మళ్లీ సిల్వర్ స్క్రీన్ మీద మెరవనున్న ఈ సంధర్భాన్ని అభిమానులు ఓ పండుగలా మార్చేస్తున్నారు. చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుంది. ఔరంగజేబు పాత్రలో బాబిడియోల్ నటించారు. ఈ సినిమాకి సంబంధించి జోరుగా ప్రమోషన్స్ జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇస్తూ మూవీపై ఆసక్తి పెంచుతున్నారు.
1000kgs tho #Viswanath70MM getting ready
Celebration by @KukatpallyPKFC@SudheerNaiduuu
🔥🔥🔥
9PM premier & 11AM fan’s show will be eye feast for fans ,🤙🤙🔥🔥 Jathini mingutharu #HariHaraVeeraMallu #HHVMBlazeFromJuly23 #HHVMPreReleaseEvent #HHVMonJuly24th pic.twitter.com/yAa7KoQv5V— SravanPspkvj🦅 (@sravanPspkVj) July 21, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | అజీర్తి సమస్య అవస్థ పెడుతోందా.. అయితే ఈ చిట్కాలు మీ కోసమే..!
Chemical Blast | కాటేదాన్ బాటిళ్ల తయారీ కంపెనీలో కెమికల్ బ్లాస్ట్
Cyclone Arnab | ‘అర్నబ్’ ఎఫెక్ట్.. దక్షిణమధ్య రైల్వే అప్రమత్తం.. పలు రైళ్లు రద్దు..!
మీరు ముఖ్యమంత్రి అవుతారు సార్.. కేటీఆర్‌తో బాలుడు
Rizwan Basha Shaik | సీఎంఆర్ బియ్యం అప్పగించాల్సిందే.. మిల్లర్లకు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ హెచ్చరిక
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

