RIPNiranjan | పవన్ కళ్యాణ్, థమన్ భావోద్వేగ నిర్ణయం.. ‘ఓజీ 2’ ఆల్బమ్ హనుమకొండ చిన్నారి నిరంజన్కి అంకితం!
PawanKalyan | హనుమకొండకు చెందిన 17 ఏళ్ల పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్ అకాల మరణం చిత్ర పరిశ్రమతో పాటు అభిమానుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.
Pawan Kalyan | హనుమకొండకు చెందిన 17 ఏళ్ల పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్ అకాల మరణం చిత్ర పరిశ్రమతో పాటు అభిమానుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. రాజకీయాల్లో తీరిక లేకుండా గడుపుతున్నప్పటికీ, తన అభిమాని మృతి పట్ల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతిని, వేదనను వ్యక్తం చేశారు. గతంలో ‘ఓజీ 2’ సినిమా వేడుకకు నిరంజన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తానని పవన్ కళ్యాణ్ స్వయంగా మాట ఇచ్చారు. అయితే, ఆ సినిమా పట్టాలెక్కే లోపే ఆ చిన్నారి కన్నుమూయడం అందరినీ కలచివేసింది.
ఈ నేపథ్యంలో నిరంజన్కు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ చిత్ర సంగీత దర్శకుడు థమన్ సోషల్ మీడియా వేదికగా ఒక భావోద్వేగ ప్రకటన చేశారు. మన లీడర్ పవన్ కళ్యాణ్ గారి ఆకాంక్ష మేరకు, ‘ఓజీ 2’ మ్యూజిక్ ఆల్బమ్ మొత్తాన్ని నిరంజన్ పవిత్ర ఆత్మకు అంకితం ఇస్తున్నట్లు థమన్ ప్రకటించారు. ఈ కష్టసమయంలో నిరంజన్ కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ పవన్ కళ్యాణ్, థమన్ మరియు అభిమాన లోకం ఘన నివాళులు అర్పించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- OG2
- OG2Album
- Pawankalyan
- Powerstar
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

