Pavala Syamala | సాయం చేయండి అంటూ హీరోలను వేడుకున్న నటి పావల శ్యామల
Pavala Syamala | రంగస్థల నటిగా ఎంట్రీ ఇచ్చి హాస్యనటి, సహాయనటిగా ఎన్నో తెలుగు చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు సీనియర్ నటి పావలా శ్యామల.
Pavala Syamala | రంగస్థల నటిగా ఎంట్రీ ఇచ్చి హాస్యనటి, సహాయనటిగా ఎన్నో తెలుగు చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు సీనియర్ నటి పావలా శ్యామల. అయితే ఈ నటి ప్రస్తుతం ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అనారోగ్య పరిస్థితులతో సినీ ఇండస్ట్రీకి దూరమైన ఆమె కష్టంగా జీవనం సాగిస్తున్నారు. అయితే తన ఆర్థిక పరిస్థితి బాగలేదని తనకు సాయం చేయండి అంటూ పావల శ్యామల తాజాగా ఒక వీడియో పెట్టింది.
అయ్యా.. 50 ఏండ్లుగా కష్టపడి నటిగా బ్రతికాను. ఈ మూడు ఏండ్ల నుంచి నా పరిస్థితి ఎలా అయ్యిందో అందరికీ తెలుసు. ఈ విషయం చాల ఇంటర్వ్యులలో కూడా చెప్పాను. కానీ ఎవరు స్పందించలేదు. ఎలాగో ఇంతవరకు వచ్చాను. ఇప్పుడు కొన ఊపిరితో ఉన్నాను. ఒక ఆర్టిస్ట్ బలవంతంగా విషం తాగి చచ్చిపోతే మీకు మనశ్శాంతిగా ఉంటుందా అండి అంటూ వేడుకుంది. దాదాపు 300 సినిమాలు చేశాను. చిరంజీవితో ప్రభాస్‌తో.. మహేశ్ బాబు, ఎన్టీఆర్ ఇలా పెద్ద పెద్ద హీరోల అందరితో చేసి.. ఆఖరికి ఆత్మహత్య చేసుకునే స్థితిలో ఉన్నాను. ట్రీట్మెంట్ చేయించుకోలేక అవస్థగా ఉన్నాను. నన్ను ఇలానే వదిలేసి ఆత్మహత్య చేసుకునేలాగా చేస్తారా.. దయచేసి తనకు సాయం చేయండి అంటూ శ్యామల తన ఆవేదన వ్యక్తం చేసింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

