Pavala Syamala | దయనీయ స్థితిలో పావలా శ్యామల.. అనారోగ్యంతో అర్ధరాత్రి ఫుట్‌పాత్‌పై సినీనటి
Pavala Syamala | ప్రముఖ సినీ నటి పావలా శ్యామల ఆరోగ్య పరిస్థితిపై అభిమానుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకప్పుడు వెండితెరపై తనదైన నటనతో ప్రేక్షకులను అలరించిన ఆమె, ప్రస్తుతం తీవ్ర అనారోగ్య సమస్యలతో పాటు ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.
Pavala Syamala | ప్రముఖ సినీ నటి పావలా శ్యామల ఆరోగ్య పరిస్థితిపై అభిమానుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకప్పుడు వెండితెరపై తనదైన నటనతో ప్రేక్షకులను అలరించిన ఆమె, ప్రస్తుతం తీవ్ర అనారోగ్య సమస్యలతో పాటు ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. సరైన ఆదాయం, అండదండలు లేక ఆమె గత కొంతకాలంగా ఎన్నో కష్టాలు పడుతున్నట్లు సమాచారం. ఇప్పటికే పావలా శ్యామల ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన పలువురు సినీ ప్రముఖులు ఆమెకు ఆర్థిక సాయం అందించారు. అయినప్పటికీ ఆమె ఆరోగ్య సమస్యలు మాత్రం మరింత క్లిష్టంగా మారినట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆమె ఇటీవల చికిత్స కోసం కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిని ఆశ్రయించినట్లు సమాచారం. చికిత్స అనంతరం అర్ధరాత్రి సమయంలో జరిగిన ఘటన మరింత చర్చనీయాంశంగా మారింది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఆస్పత్రి నుంచి వచ్చిన అనంతరం క్యాబ్ డ్రైవర్ ఆమెను కూకట్పల్లి వై జంక్షన్ వద్ద దింపి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడంతో అక్కడ ఫుట్‌పాత్‌పై ఆందోళనకర పరిస్థితిలో ఉన్న ఆమెను అటుగా వెళ్తున్న కొందరు గుర్తించినట్లు సమాచారం.
వెంటనే వారు మానవతా దృక్పథంతో స్పందించి సహాయం చేసేందుకు ముందుకొచ్చారు. అనంతరం స్థానిక పోలీసులకు, ఆర్కే ఫౌండేషన్ ప్రతినిధులకు సమాచారం అందించారు. వారి సహకారంతో పావలా శ్యామలను సనత్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటన వెలుగులోకి రావడంతో అభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో చిత్రాల్లో నటించి ప్రేక్షకుల ఆదరణ పొందిన ఓ సీనియర్ నటి ఇలాంటి పరిస్థితుల్లో ఉండటం బాధాకరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, సేవా సంస్థలు ముందుకు వచ్చి సహాయం చేయాలని అభిమానులు కోరుతున్నారు. మరోవైపు పావలా శ్యామల త్వరగా కోలుకోవాలని అభిమానులు, సినీ వర్గాలు ప్రార్థిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

