Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
Madhu Kambikar: బాలీవుడ్ విలక్షణ నటుడు నానా పటేకర్ (Nana Patekar) హఠాన్మరణం నుంచి తేరుకోకముందే సినీ అభిమానులకు మరో చేదువార్త. మరాఠీ సీనియర్ నటి మధు కాంబికర్ (Madhu Kambikar) కన్నుమూశారు.
Madhu Kambikar: బాలీవుడ్ విలక్షణ నటుడు నానా పటేకర్ (Nana Patekar) హఠాన్మరణం నుంచి తేరుకోకముందే సినీ అభిమానులకు మరో చేదువార్త. మరాఠీ సీనియర్ నటి మధు కాంబికర్ (Madhu Kambikar) కన్నుమూశారు. సినిమాల్లో పటేకర్‌కు తల్లిగా నటించిన ఆమె 73 ఏళ్ల వయసులో మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. పటేకర్ మరణాన్ని జీర్ణించుకోలేక ముందే.. చిత్రపరిశ్రమను కాంబికర్ ఇకలేరనే వార్త మరింత విషాదానికి గురి చేసింది.
చిత్ర సీమలో వరసగా రెండో విషాదం. బాలీవుడ్ నటుడు నానా పటేకర్ మరణించిన నాలుగు రోజుల్లోనే మరాఠి నటి మధు కాంబికర్ కన్నుమూశారు. ఆయనకు సినిమాల్లో తల్లిగా నటించిన ఆమె ఆరోగ్యం విషమించడంతో ప్రాణాలు విడిచారు. కొన్నాళ్లుగా పలు ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్న కాంబికర్కు పక్షవాతం వచ్చింది. ఇదివరకున్న అనారోగ్యాలు.. ఈ స్ట్రోక్ కారణంగా ఆమె శరీరం తట్టుకోలేకపోయింది. 73 ఏళ్ల వయసులో తను తుది శ్వాస విడిచారు.
Veteran Marathi actress and Lavani artiste Madhu Kambikar passes away in Pune at the age of 72 following a prolonged illness.
Her last rites were performed in Pune.
Chief Minister @Dev_Fadnavis described her demise as a major loss to Maharashtra’s art and cultural world.
#MadhuKambikar
— All India Radio News (@airnewsalerts) October 12, 2026
రెండేళ్లు చిన్న
మరాఠీ సినిమాల్లో ప్రత్యేక ముద్ర వేసిన మధు కాంబికర్.. థియేటర్, టీవీ, జానపద రంగాల్లో రానించింది. దివంగత నానా పటేకర్ కంటే రెండేళ్లు చిన్న అయిన తను.. సినిమాల్లో ఆయనకు తల్లి పాత్ర చేయడం గమనార్హం. 1995లో విడుదలైన ‘హమ్ దోనో’ చిత్రంలో, 1997లో వచ్చిన ‘యశ్వంత్’ సినిమాలో పటేకర్‌కు అమ్మగా నటించారు కాంబికర్. విలక్షణ పాత్రలతో మెప్పించిన పటేకర్ అక్టోబర్ 8న గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. గోవా రాజధాని పనాజీకి సమీపంలోని తన ఇంట్లో ఆయన ప్రాణాలు విడిచారు.
दुर्दैवी योगायोग! ‘राघू’ पाठोपाठ ‘मैना’ला मृत्यूने गाठले; ‘राघू-मैना’ चित्रपटात नाना पाटेकर व मधू कांबीकरांच्या कसदार अभिनयाची छाप
https://t.co/e6gKk5vT8u
— LoksattaLive (@LoksattaLive) October 12, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

