యువ హీరో పంజా వైష్ణవ్ తేజ్ నటిస్తున్న కొత్త చిత్రానికి ‘ఆదికేశవ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. సోమవారం ఈ చిత్రం నుంచి టైటిల్‌తో పాటు యాక్షన్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో శ్రీలీల నాయికగా నటిస్తున్నది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై ఎస్. నాగవంశీ. ఎస్. సాయిసౌజన్య నిర్మిస్తున్నారు.
శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఊరిలోని గుడిని కూల్చేందుకు వచ్చిన రౌడీలతో హీరో ఫైట్ చేస్తున్న దృశ్యాన్ని గ్లింప్స్‌లో చూపించారు. రుద్రకాళేశ్వర రెడ్డిగా వైష్ణవ్ తేజ్ పవర్‌ఫుల్‌గా కనిపించారు. ఈ సినిమాను జూలైలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.