‘పలాస’తో గుర్తింపు పొందిన కథానాయకుడు రక్షిత్ అట్లూరి నటిస్తున్న నూతన చిత్రం ‘ఆపరేషన్ రావణ్’. సంగీర్తన విపిన్ నాయిక. ధ్యాన్ అట్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి వెంకట సత్య దర్శకుడు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో విడుదల చేశారు.
దర్శకుడు మాట్లాడుతూ ‘న్యూ ఏజ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న చిత్రమిది. ప్రతి సన్నివేశం ఎంతో ఉత్కంఠభరితంగా, ఆసక్తికరంగా ఉంటుంది’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శరవణ వాసుదేవన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: శ్రీపాల్ చొళ్లేటి.