నిమ్మల శ్రీరామ్, మౌనిక జంటగా నటిస్తున్న చిత్రం ‘వన్ ప్లస్ వన్ ఆఫర్’. ఏఎస్ఆర్ శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని త్రివేణి పిక్చర్స్ పతాకంపై వి.వేణుగోపాల్ రెడ్డి నిర్మించారు. త్వరలో విడుదలకానుంది. ఇటీవల ట్రైలర్ను విడుదల చేశారు.
కథానుగుణంగా మంచి టైటిల్ కుదిరిందని, ప్రస్తుతం సమాజంలోని పోకడలకు అద్దం పడుతుందని దర్శకుడు పేర్కొన్నారు. వినోదంతో పాటు సందేశం కలబోసిన సినిమా ఇదని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: జి.దేవి వరప్రసాద్, సంగీతం: ఎంఎల్ రాజా, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: ఏఎస్ఆర్ (శ్రీరామ్).