‘రాఖీ’ సినిమా వరకూ చాలా లావుగా ఉండేవారు తారక్. రాజమౌళి ‘యమదొంగ’తో ఊహించని విధంగా స్లిమ్ అయ్యి, ప్రేక్షకులందరికీ స్వీట్ షాక్ ఇచ్చారు. ఇక అప్పట్నుంచీ మళ్లీ బరువు పెరగకుండా జాగ్రత్త పడుతూ అందంగా మారారాయన. ప్రస్తుతం ప్రశాంత్‌నీల్ దర్శకత్వం వహిస్తున్న ‘డ్రాగన్'(వర్కింగ్ టైటిల్) చిత్రంలో నటిస్తున్నారు తారక్. ఈ సినిమా కోసం ఆయన మరింత తగ్గారు. ఆ మధ్య ఎయిర్‌పోర్టుల్లో, యాడ్ ఫిల్మ్స్‌లో చిక్కిన ఎన్టీఆర్‌ని చూసి, అభిమానులే కాదు, సగటు ప్రేక్షకులు సైతం షాక్ అయ్యారు. ఈ లుక్‌పై ఆశ్చర్యం, ఆందోళన రెండూ వ్యక్తం చేశారు.
అయితే.. ఇది పాత్రకోసం చేసిన ప్రణాళికాబద్ధమైన మార్పేనని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా కోసం పాత్రకు తగ్గట్టు ఫిజిక్ కావాలని దర్శకుడు కోరడంతో… రోజుకు సుమారు 90 నిమిషాల పాటు ఫంక్షనల్ ట్రైనింగ్ చేస్తూ, కంట్రోల్ డైత్తో కేవలం 7వారాల్లో పది కేజీల బరువు తగ్గారట తారక్. ఈ విషయాన్ని ఆయన ట్రైనింగ్ టీమ్ వెల్లడించింది. మైత్రీ మూవీమేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాదే విడుదల కానున్న విషయం విదితమే.