Jailer 2 | ‘జైలర్ 2’పై తెలుగు ప్రేక్షకుల అసంతృప్తి.. ప్రమోషన్లు లేవు, బాలయ్య క్యామియో కూడా మిస్సింగ్!
Jailer 2 | సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన భారీ యాక్షన్ చిత్రం ‘జైలర్ 2’పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సీక్వెల్ అక్టోబర్ 15న విడుదల కానుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి తెలుగులో పెద్దగా ప్రమోషన్లు లేకపోవడం, తెలుగు నటులకు కీలక పాత్రలు దక్కలేదనే అభిప్రాయాలు టాలీవుడ్ ప్రేక్షకుల్లో అసంతృప్తికి కారణమవుతున్నాయి.
Jailer 2 | సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన భారీ యాక్షన్ చిత్రం ‘జైలర్ 2’పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సీక్వెల్ అక్టోబర్ 15న విడుదల కానుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి తెలుగులో పెద్దగా ప్రమోషన్లు లేకపోవడం, తెలుగు నటులకు కీలక పాత్రలు దక్కలేదనే అభిప్రాయాలు టాలీవుడ్ ప్రేక్షకుల్లో అసంతృప్తికి కారణమవుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో విడుదలకు సిద్ధమవుతున్న సినిమాకు కనీస ప్రచారం కూడా లేకపోవడంపై చర్చ నడుస్తోంది. ‘జైలర్ 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను అక్టోబర్ 12న నిర్వహించనున్నట్లు గతంలో ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీత ప్రదర్శన కూడా ఉంటుందని ప్రచారం జరిగింది. రజనీకాంత్ మినహా మిగతా చిత్రబృందం హాజరవుతుందని అభిమానులు ఆశించారు. అయితే చివరి నిమిషంలో ఈ కార్యక్రమం రద్దయినట్లు వార్తలు వచ్చాయి.
కనీసం తెలుగు మీడియాతో చిత్రబృందం సమావేశమై సినిమా గురించి మాట్లాడుతుందని ప్రేక్షకులు భావించినా, అలాంటి కార్యక్రమం కూడా కనిపించకపోవడం నిరాశకు గురిచేస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సినిమాకు మంచి మార్కెట్ ఉన్నప్పటికీ, ప్రచారంపై చిత్రబృందం ఎందుకు దృష్టి పెట్టడం లేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తెలుగు హక్కులు పొందిన పంపిణీదారులు కూడా ప్రచార కార్యక్రమాలు నిర్వహించకపోవడంపై చర్చ జరుగుతోంది. ఈ సినిమాలోని తారాగణం విషయంలోనూ తెలుగు ప్రేక్షకుల్లో కొంత అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఇతర భాషలకు చెందిన ప్రముఖ నటులకు ప్రాధాన్యం ఇచ్చినప్పటికీ, తెలుగు పరిశ్రమ నుంచి గుర్తింపు పొందిన నటుడిని కీలక పాత్రలో తీసుకోలేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
బాలీవుడ్‌కు చెందిన హృతిక్ రోషన్, విద్యా బాలన్, జాకీ ష్రాఫ్ వంటి నటుల పేర్లు ఈ ప్రాజెక్టుతో ముడిపడినట్టు ప్రచారంలోకి వచ్చాయి. మలయాళం నుంచి మోహన్‌లాల్, సూరజ్ వెంజరమూడు, కన్నడ నుంచి శివరాజ్‌కుమార్ వంటి నటుల ప్రస్తావన కూడా ఉంది. ఈ నేపథ్యంలో తెలుగు పరిశ్రమకు చెందిన నటుడికి కూడా అవకాశం ఇచ్చి ఉంటే సినిమాపై ఇక్కడ మరింత ఆసక్తి పెరిగేదని కొందరు భావిస్తున్నారు.‘జైలర్’ మొదటి భాగం సమయంలోనే నందమూరి బాలకృష్ణ అతిథి పాత్రలో కనిపించనున్నారనే ప్రచారం జరిగింది. దర్శకుడు నెల్సన్ కూడా గతంలో బాలయ్యను ఓ పాత్ర కోసం అనుకున్నామని, అయితే అది సాధ్యం కాలేదని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. దీంతో రెండో భాగంలోనైనా బాలకృష్ణ కనిపిస్తారేమోనని అభిమానులు ఆశించారు. కానీ అలాంటి అవకాశం గురించి అధికారికంగా స్పష్టత రాకపోవడంతో అభిమానుల్లో నిరాశ కనిపిస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’పై తెలుగు ప్రేక్షకుల అసంతృప్తి.. ప్రమోషన్లు లేవు, బాలయ్య క్యామియో కూడా మిస్సింగ్!
దళిత యువకుడికి అవమానం.. ఆలయంలోకి వెళ్లినందుకు దూషణలు
Goutham Raju | నా ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేయోద్దు.. ఆ వార్తలపై సీనియర్ నటుడు గౌతం రాజు ఆవేదన!
Singareni | బీఆర్ఎస్ పాలన సింగరేణికి స్వర్ణయుగం.. ఉత్పత్తి, ఆదాయం, లాభాల్లో గణనీయ వృద్ధి!
Balmuri Venkat | భూవివాదంలో ఎమ్మెల్సీ బల్మూరి.. ప్రైవేట్ ట్రస్ట్ భూమి కబ్జాకు యత్నం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

