Niharika | మెగా డాటర్‌గా గుర్తింపు పొందిన నిహారిక కొణిదెల ప్రస్తుతం నిర్మాతగా వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఆమె నిర్మాణంలో ఇటీవల విడుదలైన “రాకాస” సినిమా మంచి టాక్‌తో ముందుకు సాగుతుండగా, మరోవైపు టీవీ షోలతో కూడా ప్రేక్షకులను అలరిస్తోంది. ముఖ్యంగా ఆట షోలో జడ్జిగా వ్యవహరిస్తూ తనదైన స్టైల్లో ఆకట్టుకుంటోంది.తాజాగా ఆట షోకి నిహారిక తల్లి పద్మజ కొణిదెల హాజరయ్యారు. దీనికి సంబంధించిన ప్రోమో విడుదల కాగా, అందులో పద్మజ చెప్పిన సరదా విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిహారిక చిన్ననాటి నుంచి ఎలా ఉండేదో గురించి ఆమె చెప్పిన విషయాలు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తుతున్నాయి.
ప్రోమోలో పద్మజ మాట్లాడుతూ.. ఇంట్లో నిహారికే ఎక్కువ డామినేట్ చేస్తుంది. చిన్నప్పుడు తన తమ్ముడు వరుణ్ తేజ్‌ను బాగా కొట్టేది. నేను మాత్రం వరుణ్‌కి సపోర్ట్ చేసేదాన్ని. ఎందుకంటే నిహారిక, వాళ్ల నాన్న ఒక టీమ్‌లా ఉండేవారు అంటూ నవ్వులు పూయించారు. ఇంకా నిహారిక చదువుల గురించి కూడా ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. స్కూల్లో టీచర్ బోర్డు మీద రాసినది నిహారిక అసలు రాసుకునేది కాదు. తర్వాత నేను వెళ్లి నోట్స్ అన్నీ రాసుకొచ్చేదాన్ని. వరుణ్ చదివే కాలేజీలోనే చదివినా కాలేజీ ఎగ్గొట్టి వెళ్లేది. ఇంక గర్ల్స్ కాలేజీలో చదివితే ఎలా ఉండేదో ఊహించండి అంటూ సరదాగా చెప్పుకొచ్చారు. అంతేకాకుండా వంట విషయానికొస్తే, నిహారిక వంట చేస్తుంది కానీ, ఆ తర్వాత కిచెన్ పరిస్థితి చూసి మళ్లీ లోపలికి వెళ్లాలంటే భయపడాలి అంటూ చమత్కరించారు. ఈ కామెంట్స్ స్టూడియోలో నవ్వులు పూయించాయి.
ఈ ప్రోమో విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు ఈ వీడియోను పెద్ద ఎత్తున షేర్ చేస్తూ, పూర్తి ఎపిసోడ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రోమోలోనే ఇన్ని సరదా విషయాలు బయటపెట్టిన పద్మజ, పూర్తి ఎపిసోడ్లో ఇంకా ఎలాంటి సీక్రెట్స్ చెబుతారో చూడాలని ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. మొత్తానికి, ఈ ఎపిసోడ్ వినోదంతో పాటు నిహారిక వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర కోణాలను చూపించనుందని చెప్పాలి. అభిమానులకు ఇది ఒక స్పెషల్ ట్రీట్‌గా మారనుంది.