Neem Karoli Baba’s Biopic | ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా జీవితం ఆధారంగా తెరకెక్కిన సంచలన చిత్రం ‘హనుమాన్ అంశ్’ బాలీవుడ్లో కలెక్షన్లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే ఇంతటి ఘనవిజయం సాధించిన సినిమా తెలుగులోకి రాబోతున్నట్లు తెలుస్తుంది. హిందీ బెల్ట్‌లో ఘన విజయం సాధించి ప్రేక్షకాదరణ పొందిన ఈ చిత్రాన్ని, టాలీవుడ్ ప్రముఖ అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలుగులో విడుదల చేసే బాధ్యతలను తీసుకున్నట్లు సమాచారం.
ఈ విషయాన్ని చిత్ర నిర్మాత నమ్రతా సింగ్ స్వయంగా వెల్లడించారు. భక్తి, దైవిక అంశాలతో రూపొందిన ఈ బయోపిక్ డ్రామాను తెలుగులోనూ అదే స్థాయిలో విజయవంతం చేసేందుకు త్రివిక్రమ్ చొరవ తీసుకోవడం విశేషం. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ భక్తి చిత్రాలను విశేషంగా ఆదరిస్తుంటారు కాబట్టి, ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్‌పై అటు ఆధ్యాత్మిక వర్గాల్లో, ఇటు సినీ పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక విడుదల తేదీ వెలువడనుంది.