Sagileti Katha Movie | సగిలేటి కథ మూవీ ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
Actor Navdeep | టాలీవుడ్లో ప్రస్తుతం చిన్న సినిమా,పెద్ద సినిమా అని తేడాలు ఏమి లేవు. కంటెంట్‌తో వచ్చే ప్రతి సినిమా పెద్ద సినిమా స్థాయిలోనే విజయాలు సాధిస్తున్నాయి. స్టార్స్‌తో సంబంధం లేకుండా కంటెంట్ మీదున్న నమ్మకంతో యంగ్ టాలెంట్ సినిమాలు తీసి హిట్లు కొడుతున్నారు.
Actor Navdeep | టాలీవుడ్లో ప్రస్తుతం చిన్న సినిమా,పెద్ద సినిమా అని తేడాలు ఏమి లేవు. కంటెంట్‌తో వచ్చే ప్రతి సినిమా పెద్ద సినిమా స్థాయిలోనే విజయాలు సాధిస్తున్నాయి. స్టార్స్‌తో సంబంధం లేకుండా కంటెంట్ మీదున్న నమ్మకంతో యంగ్ టాలెంట్ సినిమాలు తీసి హిట్లు కొడుతున్నారు. ఈ కోవలోకి చెందిందే ‘సగిలేటి కథ’ మూవీ. రవితేజ మహాదాస్యం, విషిక కోట జంటగా నటిస్తున్న ఈ సినిమాకు రాజశేఖర్ సుద్మూన్ దర్శకుడు. అందరికి సుపరిచితుడైన హీరో నవదీప్ సి- స్పేస్ సమర్పణలో, అశోక్ ఆర్ట్స్, షేడ్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం. ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది.
రాయలసీమ ప్రాంతం నేపథ్యంలో ఒక గ్రామం లోని పాత్రల మధ్య జరిగే నాటకీయ ఘటనల ఆధారంగా ఆయా పాత్రల మనస్తత్వాలకు అద్దం పడుతూ, అన్ని రకాల భావోద్వేగాలను నిజాయితీగా తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేసారు. ఇది ఒక కాంటెంపరెర్రి విలేజ్ డ్రామ, పాత్రల చుట్టూ తిరిగే కథ. ఈ సినిమా చూసిన తర్వాత ఆ పాత్రలతో కొద్దిరోజులు మీరు పక్కా ట్రావెల్ చేస్తారు. ప్రతి పాత్ర చాలా సహజం గా ప్రత్యేక శైలి లో ఉండబోతుంది. ఇందులో చికెన్ కూడా ఒక పాత్ర. “చికెన్ అంటే కూరో, వేపుడో కాదు…చికెన్ అంటే ఒక ఎమోషన్ “.
మలయాళం, తమిళ్ వంటి భాషలలో వాళ్ళ కల్చర్ అండ్ ట్రెడిషన్ ని సినిమా రూపంలో చాలా కథలు చెప్పి వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు. ‘సగిలేటి కథ’ ద్వారా రాయలసీమ నేటివిటీ, కల్చర్ అండ్ ట్రెడిషన్ ని కథ రూపం లో వచ్చే ఆయా సన్నివేశాలు చూసి మన ఏపీ & తెలంగాణ లో మనమందరం కూడా సెలబ్రేట్ చేసుకుంటాం. గతంలో షేడ్ స్టూడియోస్ వారు తమ షేడ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో ‘కనబడుటలేదు’ చిత్రాన్ని నిర్మించారు. ఎప్పుడు కొత్త వారికి అండగా ఉండే షేడ్ స్టూడియోస్ మరొకసారి నూతన నటి నటులు, సాంకేతిక బృందం తో కలిసి ఇప్పుడు రెండవ చిత్రం గా ఈ “సగిలేటి కథ” ను చక్కని విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రాన్ని నిర్మించారు.
సగిలేటి కథ కేవలం సినిమా కాదు. మన జీవితంలో ఉండే అన్ని భావోద్వేగాలా సమర్పణ. ప్రతి ఒక్క పాత్ర మిమ్మల్ని అలరిస్తుంది. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. ఈ సినిమా లో హీరో గా చేయడం చాలా అదృష్టం గా భావిస్తున్నాను. ఈ చిత్రాన్ని చూసి, హీరో నవదీప్ ప్రేక్షకుల ముందుకి తన సమర్పణ లో తీసుకురావడం కొండంత బలం చేకూర్చిందని చిత్ర బృందం తెలిపింది. ఈ నెల 31 వ తారీకు ట్రైలర్ ని విడుదల చేయబోతున్నామని చిత్ర యూనిట్ పేర్కొన్నారు. ఈ సినిమాకు రచయిత, సినిమాటోగ్రఫి, ఎడిటర్, దర్శకత్వం రాజశేఖర్ సుద్మూన్ అందించారు.

Sagi
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

