Nani and Anjana | ‘బ్లాక్‌బస్టర్’ సంసారానికి 14 ఏళ్లు.. నాని-అంజు జంటకు అభిమానుల శుభాకాంక్షలు!
Natural Star Nani | టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని (Nani) వ్యక్తిగత జీవితంలో మరో మధురమైన మైలురాయిని అధిగమించారు. తన భార్య అంజనా యేలవర్తి (Anjana Yelavarthy) తో కలిసి ఆయన తన 14వ వివాహ వార్షికోత్సవాన్ని (14th Wedding Anniversary) సంతోషంగా జరుపుకున్నారు.
Nani and Anjana | టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని (Nani) వ్యక్తిగత జీవితంలో మరో మధురమైన మైలురాయిని అధిగమించారు. తన భార్య అంజనా యేలవర్తి (Anjana Yelavarthy) తో కలిసి ఆయన తన 14వ వివాహ వార్షికోత్సవాన్ని (14th Wedding Anniversary) సంతోషంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా నాని చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుండగా, అభిమానులు ఈ క్యూట్ కపుల్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నారు.
తమ 14 ఏళ్ల వైవాహిక బంధం గురించి నాని స్పందిస్తూ.. “ఈ బ్లాక్‌బస్టర్ ఫ్యామిలీ లవ్ స్టోరీకి 14 ఏళ్లు” అంటూ తన సంతోషాన్ని పంచుకున్నారు. దాదాపు ఐదేళ్ల పాటు గాఢంగా ప్రేమించుకున్న వీరిద్దరూ పెద్దల అంగీకారంతో 2012 అక్టోబర్ 27న విశాఖపట్నంలో ఒక్కటయ్యారు. ఆ తర్వాత 2017లో వీరికి బాబు అర్జున్ జన్మించాడు. ఇటు సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, అటు కుటుంబానికి ఎంతో ప్రాధాన్యతనిచ్చే నాని.. పర్సనల్ లైఫ్‌ను కూడా అంతే బ్యాలెన్స్‌గా లీడ్ చేస్తుంటారు. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా అన్యోన్యంగా ఉండే ఈ జంటను చూసి అభిమానులు ఎల్లప్పుడూ ఆదర్శంగా భావిస్తుంటారు. ప్రస్తుతం నాని కెరీర్ పరంగా వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతుండగా, మరోవైపు వైవాహిక జీవితంలోనూ అర్థ దశాబ్దానికి చేరువవుతూ ఆదర్శ దంపతులుగా నిలుస్తున్నారు. ఈ ప్రత్యేక రోజున సినీ ప్రముఖులు, అభిమానులు నాని-అంజు జోడీకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Covid 19 | కరోనా కొత్త వేరియెంట్ పీజే.2.1 వేగంగా వ్యాప్తి.. ప్రమాదకరమైనదా..?
Cruise Ship: స్టీరింగ్ కంట్రోల్ తప్పి క్రూయిజ్‌ను ఢీకొన్న ట్యాంకర్.. లగ్జరీ నౌక నుంచి దూకిన ప్రయాణికులు.. వీడియో
Sabitha Indra Reddy | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూలాన్ని మరిచిపోయారు.. మూసీ సుందరీకరణపై సబితాఇంద్రారెడ్డి ఫైర్
George Krish | సంక్రాంతి బరిలో శర్వానంద్ ‘జార్జ్ క్రిష్’.. మొదలైన డబ్బింగ్ పనులు, రిలీజ్ ఎప్పుడంటే?
INDvPAK: అండర్19 ఆసియా కప్ ఫైనల్లో ఇండియా టార్గెట్ 338
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

