నేచురల్ స్టార్ నాని ఈ మధ్య ఫ్యామిలీ పర్సన్‌గా కనిపిస్తున్నాడు. తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను తెగ షేర్ చేస్తున్నాడు. ఈ రోజు తన భార్య అంజనా యలవర్తి బర్త్ డే కావడంతో ఆమె ఫొటోలు షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. మదర్ ఆఫ్ డ్రాగన్.. వైఫ్ ఆఫ్ పాండా.. సెంటర్ ఆఫ్ అవర్ హోమ్ ..హ్యాపీ బర్త్ డే.. వి లవ్ యుఅంటూ తన భార్యకు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు నాని. ఈ పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. నాని అభిమానులు కూడా అంజనాకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
విలక్షణ కథాంశాలను ఎంచుకుంటూ వరుస సినిమాలతో బిజీగా ఉన్న నాని ప్రస్తుతం శ్యామ్ సింగ రాయ్ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా రిలీజ్‌కి రెడీ అవుతోంది. ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ మూవీలో ‘ఉప్పెన’ ఫేమ్ కృతి శెట్టి, సాయి పల్లవి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పింది. దేవదాసి వ్యవస్థ, మతపరమైన ఆచారాల చుట్టూ తిరిగే పీరియాడికల్ లవ్ స్టోరీగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అంటే సుందరానికి చిత్రంతో పాటు దసరా అనే సినిమాలు కూడా చేస్తున్నాడు నాని.