Nani | ‘ది ప్యారడైజ్’ ఫస్ట్ సింగిల్ సంచలనం.. 100 మిలియన్ వ్యూస్‌తో రికార్డు సృష్టించిన ‘ఆయా షేర్’!
Nani | నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో రూపొందుతున్న మాస్ పీరియడ్ డ్రామా ‘ది ప్యారడైజ్’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ అంచనాలను మరింత పెంచుతూ తాజాగా విడుదలైన మొదటి సింగిల్ ‘ఆయా షేర్’ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఈ పాట విడుదలైన కొద్ది రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్ మార్క్‌ను దాటి అరుదైన రికార్డు సృష్టించింది.
Nani | నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో రూపొందుతున్న మాస్ పీరియడ్ డ్రామా ‘ది ప్యారడైజ్’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ అంచనాలను మరింత పెంచుతూ తాజాగా విడుదలైన మొదటి సింగిల్ ‘ఆయా షేర్’ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఈ పాట విడుదలైన కొద్ది రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్ మార్క్‌ను దాటి అరుదైన రికార్డు సృష్టించింది. సినిమా విడుదలకు ముందే ఈ స్థాయి వ్యూస్ సాధించడం విశేషం. ముఖ్యంగా నాని కెరీర్లోనే సినిమా రిలీజ్ కాకముందే 100 మిలియన్ వ్యూస్ దాటిన తొలి పాటగా ‘ఆయా షేర్’ నిలిచింది.
ఇంకా ఒక విశేషం ఏమిటంటే, అత్యంత వేగంగా ఈ ఘనతను అందుకున్న ట్రాక్‌లలో ఇది ఒకటిగా నిలవడం. దీంతో ఈ పాట మ్యూజిక్ చార్ట్‌లను షేక్ చేస్తోంది. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ అందించిన మాస్ బీట్స్ ఈ పాటకు ప్రధాన బలం కాగా, నాని ఎనర్జిటిక్ డ్యాన్స్ మూమెంట్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ పాటలోని హుక్ స్టెప్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్‌లో అభిమానులు, ఇన్ఫ్లుయెన్సర్లు ఈ స్టెప్‌ను రీక్రియేట్ చేస్తూ వీడియోలు షేర్ చేస్తున్నారు. దీంతో ‘ఆయా షేర్’ మరింత వైరల్ అవుతోంది.
ఈ పాటను భారీ సెట్లో, స్లమ్ బ్యాక్‌డ్రాప్‌లో ఎంతో రిచ్‌గా చిత్రీకరించారు. విజువల్స్‌లో నాని రగ్గడ్ లుక్, హై-ఎనర్జీ బీట్స్‌కు పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతూ మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది. ఇక ‘ది ప్యారడైజ్’ చిత్రం ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే గ్లింప్స్, ఫస్ట్ సింగిల్‌తో హైప్ పెరిగిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో అన్న ఆసక్తి సినీ ప్రియుల్లో నెలకొంది. ‘ఆయా షేర్’ సాంగ్ సక్సెస్‌తో ‘ది ప్యారడైజ్’పై అంచనాలు మరింత పెరిగాయి. రిలీజ్‌కు ముందే రికార్డులు సృష్టిస్తున్న ఈ సినిమా, విడుదలైన తర్వాత కూడా అదే జోరు కొనసాగిస్తుందా అనేది చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- aay sher
- look
- Nani
- THE PARADISE
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

