Tuck Jagadish | నన్ను నేనే బ్యాన్ చేసుకుంటా!

‘థియేటర్స్‌లో కాకుండా ఓటీటీలో సినిమాను విడుదలచేస్తున్నందుకు నన్ను కొందరు విమర్శించారు. వారిపై నాకు ఎంతో గౌరవముంది. నేను వారి కుటుంబంలో ఓ సభ్యుడిగానే భావిస్తున్నా. కాసేపు నన్ను తమ కుటుంబం నుంచి వెలివేశారనే బాధ తప్పితే విమర్శించినవారిపై నాకు ఎలాంటి కోపం లేదు’ అని అన్నారు నాని. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘టక్ జగదీష్’. శివనిర్వాణ దర్శకుడు. సాహు గారపాటి, హరీష్‌పెద్ది నిర్మాతలు. ఈ నెల 10న అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదలకానుంది బుధవారం ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదలచేశారు. హీరో నాని మాట్లాడుతూ ‘అన్నదమ్ముల మధ్య ఉండే అనుబంధాలు, ఉమ్మడి కుటుంబాల్లోని ఆప్యాయతలతో తెలుగు తెరపై సినిమా వచ్చి చాలాకాలం అవుతోంది. ఆ లోటును భర్తీ చేసే సినిమా ఇది. చిన్నతనం నుంచి చూస్తూ పెరిగిన సినిమాల తాలూకు జ్ఞాపకాల్ని తిరిగి గుర్తుకుతెస్తుంది. సినిమాను ఓటీటీలో విడుదల చేస్తుండటం పట్ల కొందరు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు నన్ను విమర్శించారు. వారున్న పరిస్థితుల్లో అలా మాట్లాడటం తప్పు కాదు. నా సినిమాలను ఆపేస్తామన్నారు. బయటి పరిస్థితులు బాగున్నప్పుడు కూడా నా సినిమాను థియేటర్స్‌లో విడుదల చేయలేనిపక్షంలో వారు నన్ను బ్యాన్ చేయడం కాదు… నన్ను నేనే బ్యాన్ చేసుకుంటా. అన్ని కోణాల్లో ఆలోచించి ఓటీటీలో విడుదలచేస్తున్నాం’ అని తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

