ముంబై: బాలీవుడ్లో నానా పటేకర్(Nana Patekar) ఓ క్రాంతివీర్ . ఆయన నటించిన క్రాంతివీర్ చిత్రం ప్రత్యేకమైంది. 1994లో రిలీజైన ఆ ఫిల్మ్‌లో ప్రతాప్ పాత్రను పటేకర్ పోషించాడు. ఆవేశపూరితమైన ఆ పాత్రలో నానా పటేకర్ అత్యద్భుతంగా నటించాడు. అప్పట్లో ఆ ఫిల్మ్ ఓ సెన్షేషన్ క్రియేట్ చేసింది. డైలాగ్స్ చెప్పడంలో పటేకర్ తనకు తానే సాటి. స్టేజ్ పర్ఫార్మెన్స్ నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నానా పటేకర్ ఎంత పెద్ద డైలాగ్ అయినా అలవోకగా చెప్పేవాడు. ఆ డైలాగ్‌లో ఇంటెన్సిటీ ఏమాత్రం తగ్గేది కాదు. చాలా సంక్లిష్టమైన పాత్రలు చేస్తూ.. తన ప్రేక్షకులను మెప్పించేవాడు. క్రాంతివీర్ చిత్రంలో ఉరి తీసే సీన్లో నానా పటేకర్ చెప్పిన డైలాగ్‌లు ఇప్పటికీ మారుమోగుతుంటాయి. ప్రజల్లో చైతన్యం నింపేందుకు ఆ పాత్రను అద్భుతంగా మలిచారు. ఆగయా మేరి మౌత్ కా తమాషా దేక్నే అంటూ నానా పటేకర్ తన డైలాగ్స్‌తో ఊగిపోతాడు. సమాజం ఎదుర్కొంటున్న సమస్యల పట్ల మౌనంగా ఉండకూడదని ఆ పర్ఫార్మెన్స్తో గర్జిస్తాడు. రాజకీయం, మతం లాంటి అంశాలపైన కూడా ఆ సీన్లో భారీ డైలాగ్‌లు ఉంటాయి. క్రాంతివీర్లో ప్రతాప్ పాత్ర పోషించిన నానా పటేకర్‌కు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు దక్కింది. నానా పటేకర్ ఇక లేరు. కానీ ఆ ఫిల్మ్ వీడియో ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది.
Bahut actors aaye aur chale gaye, lekin Nana Patekar jaisi dialogue delivery aur attitude kisi mein nahi aaya. Aaj bhi unka woh dialogue sunta hoon to goosebumps aa jaate hain. Hum aapko bahut miss karenge, नाना पाटेकर ❤️
#NanaPatekar https://t.co/i2EmlX6WdK— Sandeep Pathak (@Im_SPathak) October 8, 2026