Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని కన్నీళ్లు.. హౌస్ గేట్లు తెరిచిన నాగార్జున, రోహిత్‌కు బ్లాక్ బ్యాడ్జ్‌తో షాక్!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10వ సీజన్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కంటెస్టెంట్ షాలిని కన్నీళ్లు పెట్టుకోవడం, హౌస్ నుంచి వెళ్లిపోతానని ప్రకటించడం, మరోవైపు రోహిత్‌కు నాగార్జున కఠినమైన శిక్ష విధించడం ఎపిసోడ్లో హైలైట్‌గా నిలిచాయి. ఇంటి సభ్యుల ప్రవర్తనపై నాగార్జున సీరియస్ కావడంతో హౌస్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10వ సీజన్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కంటెస్టెంట్ షాలిని కన్నీళ్లు పెట్టుకోవడం, హౌస్ నుంచి వెళ్లిపోతానని ప్రకటించడం, మరోవైపు రోహిత్‌కు నాగార్జున కఠినమైన శిక్ష విధించడం ఎపిసోడ్లో హైలైట్‌గా నిలిచాయి. ఇంటి సభ్యుల ప్రవర్తనపై నాగార్జున సీరియస్ కావడంతో హౌస్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. హౌస్‌లోకి షాలిని తిరిగి రావడం ఇష్టమేనా అని నాగార్జున రామ్ ప్రసాద్‌ను ప్రశ్నించారు. దీనికి ఆయన తనకు ఇష్టం లేదని సమాధానం ఇచ్చాడు. షాలినికి రెండో అవకాశం ఇచ్చినప్పటికీ, ఆమె ప్రవర్తనలో ఆశించిన మార్పు కనిపించలేదని రామ్ ప్రసాద్ అభిప్రాయపడ్డాడు.
ఈ మాటలు షాలినిని తీవ్రంగా బాధించాయి. బ్రేక్ సమయంలో ఆమె వెక్కివెక్కి ఏడుస్తూ, ప్రతి ఒక్కరూ తననే తప్పుబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు ఇక హౌస్‌లో ఉండాలని లేదని చెప్పడంతో రోహిత్, శ్వేత ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశారు. షాలిని ఎందుకు ఏడ్చిందో తెలుసుకున్న నాగార్జున, ఆమెను నేరుగా ప్రశ్నించారు. ప్రతి ఒక్కరూ తననే తప్పుబడుతున్నారని చెప్పడం సరిపోదని, తన ప్రవర్తనలో తప్పులు ఉన్నాయా లేదా అనేది కూడా ఆలోచించాలని సూచించారు. ఆ తర్వాత దక్షితో జరిగిన గొడవ, దేబ్జానీతో వివాదం, బిగ్‌బాస్ నుంచి వచ్చిన హెచ్చరికలకు సంబంధించిన దృశ్యాలను చూపించారు. పలుమార్లు హెచ్చరించినప్పటికీ షాలిని ప్రవర్తనలో మార్పు రాలేదని నాగార్జున అసహనం వ్యక్తం చేశారు. ఆమె ప్రవర్తనపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ క్లాస్ తీసుకున్నారు.
దీంతో షాలిని కన్నీళ్లు పెట్టుకుంటూ, తన తప్పు ఉంటే హౌస్ నుంచి వెళ్లిపోతానని చెప్పింది. వెంటనే నాగార్జున హౌస్ గేట్లు తెరిపించడంతో ఆమె నిజంగానే బయటకు వెళ్లేందుకు సిద్ధమైంది. అయితే రోహిత్, ఇతర ఇంటి సభ్యులు ఆమెను ఆపి, ఇక్కడే ఉండి తనను తాను నిరూపించుకోవాలని నచ్చజెప్పారు. దీంతో షాలిని తన నిర్ణయాన్ని మార్చుకుని, జరిగిన తప్పులను మళ్లీ చేయనని చెప్పి నాగార్జునకు క్షమాపణలు చెప్పింది. ఇదే ఎపిసోడ్లో త్రిగుణ్ ప్రవర్తనపైనా నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. రోహిత్‌తో వాగ్వాదం సందర్భంగా త్రిగుణ్ ఉపయోగించిన అభ్యంతరకరమైన మాటలను తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో త్రిగుణ్‌కు జైలు శిక్ష విధిస్తున్నట్లు ప్రకటించారు.
ఇంటి సభ్యులతో వ్యవహరించే విషయంలో హద్దులు పాటించాలని, కోపంలోనూ వ్యక్తిగత దూషణలకు దిగకూడదని నాగార్జున స్పష్టం చేశారు. దీంతో త్రిగుణ్‌కు ఈ ఎపిసోడ్లో ఊహించని షాక్ తగిలింది.మరోవైపు రోహిత్ ప్రవర్తనపై కూడా నాగార్జున తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గతంలో పలుమార్లు హెచ్చరించినప్పటికీ, అసభ్యకరమైన మాటలు మాట్లాడటం, అనుచితంగా ప్రవర్తించడం ఆపడం లేదని మందలించారు. దీనికి శిక్షగా రోహిత్‌కు బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చారు. అంతేకాకుండా, హౌస్‌లో ఉన్నన్ని రోజులు కెప్టెన్ అయ్యే అవకాశంతో పాటు కెప్టెన్సీ పోటీదారుడిగా నిలిచే అవకాశాన్ని కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయంతో రోహిత్ తీవ్రంగా నిరాశ చెందాడు. మోకాళ్లపై కూర్చుని నాగార్జునను వేడుకుంటూ, ఈ శిక్ష వల్ల తన ఆట మొత్తం దెబ్బతింటుందని, దయచేసి శిక్షను తగ్గించాలని కోరాడు.
రోహిత్ విజ్ఞప్తి చేసిన తర్వాత నాగార్జున ఇంటి సభ్యుల అభిప్రాయాలను అడిగారు. అనంతరం రోహిత్‌కు విధించిన శిక్షను రెండు వారాలకు తగ్గించినట్లు ప్రకటించారు. దీంతో రోహిత్‌కు కొంత ఊరట లభించినప్పటికీ, ఈ శిక్ష అతడి ఆటపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆసక్తి నెలకొంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని కన్నీళ్లు.. హౌస్ గేట్లు తెరిచిన నాగార్జున, రోహిత్‌కు బ్లాక్ బ్యాడ్జ్‌తో షాక్!
Arunachal Pradesh | అగ్నిగుండంగా అరుణాచల్ ప్రదేశ్.. హైడ్రోపవర్ ప్రాజెక్టు వ్యతిరేక నిరసనల్లో హింసాకాండ!
Medigadda | నిరంతరం జలతరంగం.. మేడిగడ్డ వద్ద 20 వేల క్యూసెక్కుల ప్రవాహం
Jagadish Reddy | కన్నెపల్లికి పోదామా.. పంపులు ఆన్ చేస్తే నీళ్లు ఎందుకు రావో చూస్తా.. జగదీశ్ రెడ్డి సవాల్!
Random Trees | కేటీఆర్ స్ఫూర్తితో.. ర్యాండమ్ ట్రీస్.. అమెరికాలో ప్రారంభమై, పలు దేశాలకు సేవలందిస్తున్న కంపెనీ
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

