‘బంగార్రాజు, సత్యభామ చూడముచ్చటైన జంట. వారిద్దరి సరససల్లాపాల్ని వర్ణించడానికి మాటలు చాలవు. ఈ జోడీ చేసే హంగామా ఏంటో తెరపై చూడాల్సిందే’ అంటున్నారు కల్యాణ్‌కృష్ణ కురసాల. ఆయన దర్శకత్వంలో నాగార్జున కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘బంగార్రాజు’. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రానికి సీక్వెల్ ఇది. జీ స్టూడియోస్, అన్నపూర్ణ సంస్థలు నిర్మిస్తున్నాయి. నాగార్జున సరసన రమ్యకృష్ణ నటిస్తోంది. బుధవారం రమ్యకృష్ణ జన్మదినం సందర్భంగా సత్యభామగా ఆమె లుక్‌ను విడుదల చేశారు. ఇందులో నాగార్జున, రమ్యకృష్ణ సంప్రదాయ వస్త్రధారణలో హుషారుగా నర్తిస్తూ కనిపిస్తున్నారు. ‘హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నాం’ అని చిత్రబృందం తెలిపింది. ఈ సినిమాలో నాగచైతన్య మరో కథానాయకుడిగా నటిస్తున్నారు. కృతిశెట్టి, చలపతిరావు, రావు రమేష్, బ్రహ్మాజీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌రూబెన్స్, కెమెరా: యువరాజ్, నిర్మాత: అక్కినేని నాగార్జున, కథ, దర్శకత్వం: కల్యాణ్‌కృష్ణ కురసాల.