ఛలోపదవే..
నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తున్న మిస్టరీ మైథాలజీ థ్రిల్లర్ ‘వృషకర్మ’. నిధి అన్వేషణ నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ చిత్రానికి కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి.
నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తున్న మిస్టరీ మైథాలజీ థ్రిల్లర్ ‘వృషకర్మ’. నిధి అన్వేషణ నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ చిత్రానికి కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకురానుంది. బుధవారం ఈ సినిమా నుంచి ‘ఛలో పదవే’ అంటూ సాగే రెండో పాటను విడుదల చేశారు. అజనీష్ బి లోక్‌నాథ్ సంగీతాన్నందించిన ఈ పాటను అనంతశ్రీరామ్ రచించారు. జీవితంలోని ప్రతిక్షణాన్ని ఆస్వాదించాలనే సందేశాన్ని ఇస్తూ స్ఫూర్తివంతంగా ఈ పాట సాగింది.
నాగచైతన్య, చిన్నారి కియారా ఖన్నా మధ్య ఉండే అనుబంధాన్ని ఈ పాటలో హృద్యంగా చూపించారు. చూపులేని చిన్నారి అయిన కియారా ఖన్నాకు కథానాయకుడు అర్జున్ అండగా నిలవడం, వీరిద్దరి మధ్య ఉండే భావోద్వేగ బంధానికి ఈ పాట అద్దంపట్టింది. ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ ‘ఈ సినిమాలో నేను అర్జున్ అనే ట్రెజర్ హంటర్ పాత్రలో నటించాను. ఈ సినిమా కాన్సెప్ట్, విజువల్స్ అన్నీ కొత్తగా ఉంటాయి. ఆద్యంతం ప్రేక్షకుల్ని థ్రిల్‌కి గురిచేసే చిత్రమిది’ అన్నారు. మీనాక్షి చౌదరి, స్పర్ష్ శ్రీవాస్తవ, కియారా ఖన్నా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాతలు: బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ బి, రచన-దర్శకత్వం: కార్తీక్ దండు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

