Project-K | ‘ప్రాజెక్ట్-K’పై ప్రభాస్ అభిమాని ట్వీట్.. అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్!
Project-K | ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. చిన్న గాయం కారణంగా కొన్నిరోజులు షూటింగ్‌లకు విరామం ఇచ్చిన ప్రభాస్ ఇటీవలే ‘సలార్’ షూటింగ్లో అడుగుపెట్టాడు. ఈ షెడ్యూల్ పూర్తవ్వగానే ‘ప్రాజెక్ట్-K’ లాంగ్ షెడ్యూల్లో పాల్గొననున్నాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పాన్ వరల్డ్ సినిమాగా తెరకెక్కనుంది. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, దిశాపటానీ వంటి బాలీవుడ్ స్టార్లు ఈ చిత్రంలో నటించనుండటంతో ప్రేక్షకులలో భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇటీవలే విడుదలైన ‘రాధేశ్యామ్’ ప్రభాస్ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. దాంతో అప్సెట్ అయిన అభిమానులు ప్రభాస్ తరువాతి సినిమాల అప్డేట్ల కోసం చిత్రబృందాన్ని ట్యాగ్ చేస్తూ అప్డేట్లను అడుగుతున్నారు.
ఈ క్రమంలోనే ప్రభాస్ అభిమాని నాగ్ అశ్విన్‌ను ట్యాగ్ చేస్తూ ‘హాయ్ నాగ్ అశ్విన్ అన్నా గుర్తున్నామా’ అని ట్విట్టర్లో పేర్కొన్నాడు. దానికి నాగ్ అశ్విన్ స్పందించి ‘గుర్తున్నారు.. ఇప్పుడే ఒక షెడ్యూల్ పూర్తైంది. ప్రభాస్ గారి ఇంట్రో బిట్ కూడా కంప్లీట్ అయ్యింది. ఈ షెడ్యూల్లో హీరో చాలా కూల్ గా కనిపిస్తున్నారు. జూన్ చివరి నుంచి తదుపరి షెడ్యూల్ ప్రారంభం కానుంది. రిలీజ్ ఆర్డర్ లో మనం లాస్ట్ కదా, తరుచూ అప్డేట్స్ ఇవ్వడానికి సమయం ఉంది. కానీ ప్రాజెక్ట్- K కోసం అందరం ప్రాణం పెట్టి పని చేస్తున్నాం’ అని ట్విట్టర్లో అభిమానికి బదులిచ్చాడు. ఈ ట్వీట్‌పై ప్రభాస్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇక ఈ చిత్రాన్ని అత్యంత భారీగా దాదాపు రూ.500కోట్ల భారీ బడ్జెట్‌తో వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మిస్తున్నాడు. ఈ ఏడాదిలో షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది ప్రథమార్థంలో చిత్రాన్ని ప్రేక్షకుల మందుకు తీసుకురావాలని మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు.
Gurtunnaru 🙂 ippude oka schedule ayindi… including prabhas gari intro bit…he looks v cool…june end nunchi malli start…release order lo manam last kada…Inka frequent updates ivvadaniki time undi…but rest assured..andaru pranam petti panichestunnam #Projectk
— Nag Ashwin (@nagashwin7) May 17, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
MBA student dies | పరీక్షకు ముందు యూనివర్సిటీ భవనం పైనుంచి దూకి.. ఎంబీఏ విద్యార్థిని మృతి
ఉద్యోగుల సుదీర్థ సేవలు సంస్థకు చిరస్మరణీయం : ఎస్ ఓ టు జీఎం ఎం.గోవిందరావు
DK Aruna | భూములు అమ్మి రాష్ట్రాన్ని నడుపుతారా.. సీఎం రేవంత్ రెడ్డిపై డీకే అరుణ ఫైర్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

