స్వయంభూ మానసహారిణి
హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న హిస్టారికల్ ప్రాజెక్ట్ ‘స్వయంభూ’. ఇందులో నిఖిల్ యుద్ధవీరుడిగా నటిస్తున్నాడు. ఇది ఆయన 20వ సినిమా కావడం విశేషం.
హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న హిస్టారికల్ ప్రాజెక్ట్ ‘స్వయంభూ’. ఇందులో నిఖిల్ యుద్ధవీరుడిగా నటిస్తున్నాడు. ఇది ఆయన 20వ సినిమా కావడం విశేషం. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో భువన్, శ్రీకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో సంయుక్తమీనన్ ఒక కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆమె తన పాత్ర కోసం శిక్షణ కూడా తీసుకుంది. అలాగే, ఇందులో మరో కథానాయికగా నటిస్తున్న నభా నటేష్‌కు ఈ సినిమా షూటింగ్‌లోనే చేతికి గాయం కాగా, అది నయం కావడంతో ఆమె మళ్లీ షూటింగ్లో జాయిన్ అయ్యింది.
గురువారం మేకర్స్ ఈ సినిమాలోని ఆమె లుక్‌ని విడుదల చేశారు. గాయం నుంచి కోలుకొని టీంలో చేరినట్టు వీడియోలో ప్రజెంట్ చేశారు. మేకర్స్ విడుదల చేసిన పోస్టర్లో నభా యువరాణిలా కనిపిస్తున్నది. చీరలో, నగలతో అత్యంత మనోహరంగా కనిపిస్తున్నది నభానటేష్. ఇందులో నభాది శక్తిమంతమైన పాత్ర అని లుక్ చెప్పకనే చెబుతున్నది. అత్యంత భారీ బడ్జెట్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మాటలు: వాసుదేవ్ మునెప్పగారి, సంగీతం: రవి బస్రూర్, సమర్పణ: ఠాగూర్ మధు, నిర్మాణం: పిక్సెల్ స్టూడియోస్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush | ధనుష్ రాజకీయాల్లోకి రావడం ఖయమా.. విజయ్ పార్టీ నేతలు అప్పుడే సెటైర్స్ స్టార్ట్ చేశారుగా..!
పెద్దవాగులో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలి : ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి
Health Tips | స్వీట్లు తినడం మానేసినా షుగర్ లెవల్స్ తగ్గడం లేదా.. అయితే కారణం ఇదే..!
Rahul Gandhi | రాహుల్‌గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. ఒకదానినొకటి ఢీకొన్న ఐదు కార్లు, అంబులెన్స్..!
Medak | నకిలీ విత్తనాలతో మోసపోయిన రైతులు.. ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిస్తున్న షాపు యజమాని
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

