Khushbu Interview | రామబాణంలో సేంద్రీయ ఆహారాన్ని ప్రమోట్ చేసే పాత్రలో కనిపిస్తా.. ఖుష్బూ చిట్‌చాట్
Khushbu | ప్రస్తుతం గోపీచంద్ (Gopichand) హీరోగా నటిస్తున్న రామబాణం (Ramabanam) కీలక పాత్రలో నటిస్తోంది ఖుష్బూ (Khushbu). ఈ చిత్రం మే 5న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఖుష్బూ మీడియాతో చిట్ చాట్ చేశారు. రామబాణం విశేషాలు ఖుష్బూ మాటల్లోనే..
Khushbu | మూవీ లవర్స్ కు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు ఖుష్బూ. తెలుగు, తమిళంతోపాటు వివిధ భాషల్లో సినిమాలు చేస్తూ సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ప్రస్తుతం గోపీచంద్ (Gopichand) హీరోగా నటిస్తున్న రామబాణం (Ramabanam) కీలక పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రం మే 5న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఖుష్బూ మీడియాతో చిట్ చాట్ చేశారు. రామబాణం విశేషాలు ఖుష్బూ మాటల్లోనే..
రామబాణంలో మీ పాత్ర ఎలా ఉంటుంది..?
నా హృదయానికి దగ్గరగా ఉన్న సినిమా ఇది. ఈ సినిమా నుంచి బంధుత్వాల విలువ ఎంత ముఖ్యమైందో తెలుసుకున్నా. ఎప్పుడూ సంపాదనే కాదు.. ఈ సినిమా మీ ప్రియమైన వారిని కలిసి ఉంచేలా చేస్తుంది. ఇందులో నేను సేంద్రీయ, సంప్రదాయ ఆహారం ప్రాధాన్యతను ప్రమోట్ చేసే పాత్రలో కనిపిస్తా.
రామబాణంలో ముఖ్యమైన ఎలిమెంట్ ఏంటీ..?
నిల్వ ఉంచిన ఆహారాన్ని అధికంగా తీసుకోవడం వల్ల మరిన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి. తరచుగా ప్యాక్ చేసిన ప్యాకెట్లలో వచ్చే ఫాస్ట్ ఫుడ్‌తో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. టెర్రకోట, సాంప్రదాయ గ్రైండర్లతో గ్రైండింగ్ లాంటి సంప్రదాయ పద్ధతులను ఉపయోగించి రుచికరమైన ఆహారాన్ని తయారు చేయవచ్చు. నేటి కాలంలో ప్రజలు ఫాస్ట్ ఫుడ్‌ను ఎక్కువగా ఎంపిక చేసుకుంటున్నారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రోత్సహించడమే రామబాణం ప్రధాన నినాదం.
గోపీచంద్, జగపతిబాబుతో పనిచేయడం ఎలా ఉంది..?
నేను, గోపీచంద్ కాంటాక్ట్ వివరాలు ఇచ్చిపుచ్చుకోవడం కానీ, ఫొటోలు తీసుకోవడం కానీ చేయలేదని చివరి రోజు షూటింగ్లో రియలైజ్ అయ్యాం. గోపీచంద్ రిజర్వ్డ్ పర్సన్ అయినప్పటికీ సెట్స్‌లో ఫన్నీగా ఉంటాడు.. జగపతిబాబు నాకు చాలా కాలంగా తెలుసు. ఆయన ప్రొడక్షన్ హౌజ్‌లో కూడా పనిచేశా.
మీకు ఎలాంటి పాత్రలు చేయాలనుంది..?
నా మైండ్‌లో ప్రత్యేకించి ఇలాంటి పాత్ర అని ఏం లేదు. ప్రత్యేకమైన పాత్రేమి చేయలేదని ఎప్పుడూ ఫీల్ కాలేదు. కానీ నిజంగా చెప్పాలంటే.. టబు, అమితాబ్ బచ్చన్‌తో చేసిన Cheeni Kum సినిమా చూసి అసూయ వేసింది. నేను ఎంతగానో అభిమానించే అమితాబ్ బచ్చన్‌తో రొమాన్స్ చేసినందుకు టబుపై (నవ్వుతూ) ఫైర్ అయ్యా.
మీ రాజకీయ ప్రయాణం గురించి..?
గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేశా. కానీ దురదృష్ణవశాత్తు గెలువలేదు. కానీ ఇప్పుడు నేను పోటీ చేయాలా..? వద్దా అనేది పార్టీ నిర్ణయిస్తుంది. నేను సినిమాలు, రాజకీయాలు బ్యాలెన్స్ చేయగలనన్న నమ్మకముంది.
రాబోయే రోజుల్లో మరిన్ని తెలుగు సినిమాల్లో పనిచేస్తారా..?
ఒకవేళ అవకాశమొస్తే చిరంజీవి, బాలకృష్ణ సినిమాల్లో నటిస్తా. ఇండస్ట్రీలో చాలా కాలంగా ఉన్నప్పటికీ వారితో పూర్తి స్థాయిలో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం రాలేదు. సరైన కథ వస్తే వారితో కలిసి పనిచేస్తా.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Modi | ప్రభుత్వం మారినా రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం.. తమిళనాడులో ప్రధాని మోదీ
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
truck rams Durga idol procession | దుర్గా విగ్రహం ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి, పది మందికి గాయాలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

