కొత్తదనం ఉండాల్సిందే..!

‘భవిష్యత్తును గురించి ఎక్కువగా కలలు కనను. వర్తమానంలోనే జీవిస్తా. ప్రస్తుతం ఏం చేస్తున్నామన్నదే నాకు ముఖ్యం’ అని అంటోంది కావ్యథాపర్. ఆమె కథానాయికగా నటించిన ‘ఏక్ మినీ కథ’ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా కావ్య థాపర్ మాట్లాడుతూ ‘సినిమాతో పాటు నా పాత్రకు చక్కటి స్పందన లభిస్తోంది. బోల్డ్ పాయింట్‌తో దర్శకుడు కార్తిక్ చెప్పిన కథ విని తొలుత భయపడ్డా. కథతో పాటు పాత్రలను తీర్చిదిద్దిన విధానం ఆసక్తికరంగా అనిపించడంతో ఈ సినిమాను అంగీకరించాను. సెక్స్ ఎడ్యుకేషన్ విషయంలో చాలా మందిలో అపోహలు ఉన్నాయి. తమ సమస్యల్ని ఎవరికీ చెప్పుకోలేక ఆత్మన్యూనత భావంతో బాధపడే వారిలో అవగాహన కల్పించేలా ఆలోచనాత్మకంగా సినిమాను తెరకెక్కించారు. భౌతికదూరం పాటిస్తూ.. మాస్క్‌లు, శానిటైజేషన్ లాంటి జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్లో పాల్గొనడం చాలెంజింగ్‌గా అనిపించింది. తెలుగుచిత్రసీమలో క్రమశిక్షణకు ప్రాధాన్యతనిస్తారు. ప్రణాళిక ప్రకారం షూటింగ్‌లు జరుగుతాయి. హిందీలో సమయపాలనను పట్టించుకోరు. పాత్రల పరంగా నాకు ఎలాంటి పరిమితులు లేవు. కొత్తదనం ఉందనిపిస్తే ఏ క్యారెక్టర్ అయినా చేస్తా. ప్రస్తుతం హిందీలో రాజ్, డీకే దర్శకత్వంలో రూపొందుతున్న వెబ్‌సిరీస్‌లో నటిస్తున్నా’ అని తెలిపింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sugar | చక్కెరలో ఉండే మూడు రకాలు ఏమిటి.. అవి ఏం చేస్తాయి..?
Assailant | మలక్‌పేట్‌లో మహిళల రూంలోకి ప్రవేశించిన ఆగంతకుడు
KTR | ఇంకో సంవత్సరం మాత్రమే ఉంది.. ఆ తర్వాత కేసీఆర్ వస్తరు : కేటీఆర్
Health tips | అజీర్తి సమస్య అవస్థ పెడుతోందా.. అయితే ఈ చిట్కాలు మీ కోసమే..!
Chemical Blast | కాటేదాన్ బాటిళ్ల తయారీ కంపెనీలో కెమికల్ బ్లాస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

