Sohel Interview | ఈ కథను పెద్ద హీరోతో చేయాలనుకున్నాడు.. మిస్టర్ ప్రెగ్నెంట్ హీరో సోహెల్ ఇంటర్వ్యూ
Sohel Interview | బిగ్‌బాస్ ఫేం సయ్యద్ సోహెల్ ర్యాన్ (Syed Sohel Ryan) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం మిస్టర్ ప్రెగ్నెంట్ (Mr Pregnant). ఆగస్టు 18న (రేపు) థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా సోహెల్ మీడియాతో చిట్ చాట్ చేసి.. సినిమా విశేషాలు పంచుకున్నాడు.
Sohel Interview | బిగ్‌బాస్ ఫేం సయ్యద్ సోహెల్ ర్యాన్ (Syed Sohel Ryan) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం మిస్టర్ ప్రెగ్నెంట్ (Mr Pregnant). డైరెక్టర్ శ్రీనివాస్ వింజనంపాటి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో రూప కొడవయూర్ హీరోయిన్గా నటిస్తోంది. వినూత్న కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీ ఆగస్టు 18న (రేపు) థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా సోహెల్ మీడియాతో చిట్ చాట్ చేసి.. సినిమా విశేషాలు పంచుకున్నాడు.
ఈ సినిమా ఎలా మొదలైంది..?
డైరెక్టర్ శ్రీనివాస్ వింజనంపాటి ఎనిమిదేండ్లుగా నాకు స్నేహితుడు. ఈ కథను ఓ పెద్ద హీరోతో చేయాలనుకున్నాడు. మేమిద్దరం కొత్తవాళ్లం (అప్పటికీ నేనింకా బిగ్‌బాస్‌కు రాలేదు) కాబట్టి సినిమా చేస్తే వర్కవుట్ కాదన్నాడు. బిగ్ బాస్‌కు వచ్చిన తర్వాత నేను ఈ సినిమాలో హీరో అని శ్రీనివాస్ చెప్పాడు. ఆ తర్వాత సినిమాకు సైన్ చేయడంతో మొదలైంది.
మిస్టర్ ప్రెగ్నెంట్ లాంటి సినిమా చేయడం రిస్క్ అనిపించలేదా..?
బిగ్‌బాస్ నన్ను ప్రేక్షకులకు దగ్గర చేసింది. స్టార్ హీరోలు కమర్షియల్ సినిమాలు చేస్తే.. వారికి అభిమానులుంటారు కాబట్టి వర్కవుట్ అవుతుంది. కానీ నా లాంటి యువ హీరోలు ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే ఏదైనా కొత్తది చేయాలి. మిస్టర్ ప్రెగ్నెంట్ చేయాలనుకున్నప్పుడు రిస్క్ అని ఏం ఆలోచించలేదు. నా లాంటి యువ నటులకు రొటీన్ కమర్షియల్ సినిమాలు చేయడం చాలా రిస్క్.
ప్రేక్షకులు సినిమాను ఒప్పుకుంటారా..?
ప్రెగ్నెంట్ మహిళల కోసం స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశాం. షో తర్వాత వాళ్లు భావోద్వేగంతో ఏడ్చేశారు. మహిళలు పడుతున్న ఇబ్బందులను చక్కగా చిత్రీకరించామన్నారు. మా సినిమా ప్రేక్షకులకు ఎంతగా కనెక్ట్ అయ్యిందో చెప్పడానికి ఇదే ఉత్తమ ఉదాహరణ. రేపు థియేటర్లలో కూడా అదే స్పందన వస్తుందని ఆశిస్తున్నాం.
సినిమా ఆలస్యమైనప్పుడు ఎలా ఫీలయ్యారు..?
సినిమా విడుదల ఆలస్యమైనప్పుడు నేను డిప్రెషన్లోకి వెళ్లిపోయా. మిస్టర్ ప్రెగ్నెంట్‌పై చాలా ఆశలు పెట్టుకున్నా. ఇది నా కెరీర్‌కు గేమ్ ఛేంజర్‌లాంటిదని బలంగా నమ్ముతున్నా.
సినిమా నిర్మాత గురించి..
Mic Movies అప్పిరెడ్డి కొత్త దర్శకులు, హీరోలకు సపోర్టుగా నిలుస్తారు. ప్రస్తుతం కనీసం ఐదు నుంచి ఆరు కోట్ల బడ్జెట్ తో సినిమాలు తీస్తున్నారు. అవసరమైతే ఇంకొంత బడ్జెట్ పెట్టి స్టార్ హీరోలను ప్రయత్నించవచ్చు. కానీ కొత్త వారికి అవకాశాలు కల్పిస్తున్నారు. మైక్ మూవీస్‌లో సినిమా చేయడం ఆనందంగా ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | కొల్లూర్ ఓఆర్ఆర్ పైన ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
Kerala woman | తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కొడుకు.. 13 ఏళ్ల తర్వాత కలుసుకున్న తల్లీ, పిల్లలు
DDLJ Movie | షారుఖ్ ఖాన్ పుట్టినరోజు కానుక.. థియేటర్లలోకి ‘డిడిఎల్జె’ రీ-రిలీజ్!
AP Singh | భారత బలగాలకు అందని లక్ష్యమంటూ ఏదీలేదు.. ఎయిర్‌చీఫ్ మార్షల్ ఏపీ సింగ్..!
Breast Cancer | రొమ్ము క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించి చికిత్స చేయించుకున్న మహిళ.. ప్రాణాలను కాపాడుకోవడంలో కీలకం..
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

