Ramabanam | టాలీవుడ్ హీరో గోపీచంద్ (Gopichand) నటిస్తున్న తాజా చిత్రం రామబాణం (Ramabanam). శ్రీవాసు దర్శకత్వం వహిస్తున్నాడు. డింపుల్ హయతి ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. రామబాణం నుంచి తాజాగా మోనాలిసా మోనాలిసా లిరికల్ వీడియో సాంగ్ (Monalisa Lyrical Video song)ను మేకర్స్ లాంఛ్ చేశారు. భాస్కరభట్ల రవికుమార్ ఈ పాటను రాయగా.. మిక్కీ జే మేయర్ కంపోజిషన్‌లో శ్రీకృష్ణ, గీతామాధురి పాడారు. ఈ సాంగ్ దినేష్ కుమార్ కొరియోగ్రఫీలో మాస్ బీట్తో ఎనర్జిటిక్‌గా సాగుతూ మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటోంది.
ఇప్పటికే విడుదలైన రామబాణం పాటలకు మంచి స్పందన వస్తోంది. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో రామబాణం ఉండబోతున్నట్టు ఇప్పటికే విడుదల చేసిన టీజర్, ట్రైలర్‌తో తెలిసిపోతుంది. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు.
రామబాణంలో ఖుష్బూ సుందర్, జగపతిబాబు, సచిన్ ఖేడ్కర్, నాజర్, అలీ, రాజా రవీంద్ర, వెన్నెల కిశోర్, సప్తగిరి, కాశీ విశ్వనాథ్, సత్య, గెటప్ శ్రీను, సమీర్, తరుణ్ అరోరా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మే 5న థియేటర్లలో సందడి చేయనుంది రామబాణం.
మోనాలిసా లిరికల్ వీడియో సాంగ్..
రామబాణం గ్లింప్స్ వీడియో..
రామబాణం ట్రైలర్..