Thudarum | మోహన్‌లాల్ ‘తుడరుమ్’ తెలుగు ట్రైలర్ రిలీజ్
Mohanlal | ఎల్2 ఎంపురాన్ సినిమాతో విజయం అందుకున్నాడు మలయాళ స్టార్ మోహన్ లాల్. పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. బ్లాక్ బస్టర్ చిత్రం లుసిఫర్ (Lucifer) సినిమాకి ఈ చిత్రం పార్ట్ 2గా వచ్చింది.
Mohanlal | ఒకవైపు ఎల్2 ఎంపురాన్ సినిమాతో విజయం అందుకున్నాడు మలయాళ స్టార్ మోహన్ లాల్. పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. బ్లాక్ బస్టర్ చిత్రం లుసిఫర్ (Lucifer) సినిమాకి ఈ చిత్రం పార్ట్ 2గా వచ్చింది. మంజు వారియర్ (Manju Warrier), టోవినో థామస్(Tovino Thomas) కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం మార్చి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చి దాదాపు రూ. 250 కోట్లకు పైగా వసుళ్లను రాబట్టింది.
అయితే ఈ సినిమా అనంతరం మరో సినిమాను విడుదలకు సిద్ధం చేశాడు లల్లెట్టన్. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘తుడరుమ్’ (Thudarum). ఈ సినిమాకు మలయాళ పాపులర్ డైరెక్టర్, ఆపరేషన్ జీవా ఫేం తరుణ్ మూర్తి దర్శకత్వం వహిస్తుండగా.. రెజపుత్ర విజువల్ మీడియా సమర్పణలో ఎమ్ రెంజిత్ నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో సీనియర్ నటి శోభన కథానాయికగా నటిస్తుంది. ఇప్పటివరకు మోహన్ లాల్, శోభన కాంబోలో 55 సినిమాలు రాగా.. ఇది 56వ చిత్రంగా రాబోతుంది. మోహన్‌లాల్‌తో చివరిగా 1987లో నటించిన శోభన దాదాపు 38 ఏండ్ల తర్వాత మళ్లీ కలిసి నటిస్తుంది. ఈ చిత్రం మలయాళంతో పాటు తెలుగులో ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి తెలుగు ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. మోహన్ లాల్ ఇందులో టాక్సీ డ్రైవర్‌గా నటిస్తుండగా.. అతడి కారు అనుకోకుండా ఒక సమస్యలో ఇరుక్కుంటుంది. అయితే ఆ సమస్య ఏంటి.. ఆ కారుని వదిలిపెట్టి మోహన్‌లాల్ ఒక్కక్షణం ఎందుకు ఉండలేడు అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. క్రైమ్ కామెడీగా ఈ చిత్రం రాబోతుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

