Mohanlal Dance | ఇద్దరు హీరోయిన్లతో ‘మనోహరి’ పాటకు మోహన్‌లాల్ మాస్ స్టెప్పులు.. వీడియో!
Mohanlal Dance | మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ ‘బాహుబలి: ది బిగినింగ్’ చిత్రంలోని సూపర్ హిట్ ఐటమ్ సాంగ్ ‘మనోహరి’ పాటకు ఇద్దరు నటీమణులతో కలిసి స్టెప్పులేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
Mohanlal Dance | మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ ‘బాహుబలి: ది బిగినింగ్’ చిత్రంలోని సూపర్ హిట్ ఐటమ్ సాంగ్ ‘మనోహరి’ పాటకు ఇద్దరు నటీమణులతో కలిసి స్టెప్పులేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఇటీవల జరిగిన ఓ ప్రైవేట్ ఈవెంట్లో వేదికపై ‘లాలేట్టన్’ తనదైన గ్రేస్, ఎనర్జీతో ఈ పాటకు హుషారైన స్టెప్పులు వేసి అక్కడున్న వారిని ఆకట్టుకున్నారు. ఒరిజినల్ సాంగ్‌లో ప్రభాస్ ముగ్గురు ముద్దుగుమ్మలతో కలిసి డాన్స్ చేయగా, ఇక్కడ మోహన్‌లాల్ ఇద్దరు నటీమణులతో కలిసి అలరించారు. బాహుబలి కాస్ట్యూమ్స్‌ను గుర్తుకు తెచ్చేలా ఉన్న డ్రెస్‌లతో సాగిన ఈ డాన్స్ పర్ఫార్మెన్స్కు నెటిజన్ల నుంచి భారీ స్పందన వస్తోంది. 65 ఏళ్ల వయసులోనూ మోహన్‌లాల్ అంత ఈజ్‌తో, అంతటి ఎనర్జీతో డ్యాన్స్ చేయడం చూసి ప్రభాస్ అభిమానులతో పాటు మలయాళ, తెలుగు సినీ ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ‘బాహుబలి’ సినిమా, ఆ పాటలు భాషతో సంబంధం లేకుండా అందరినీ అలరించాయని, ఇప్పుడు మోహన్‌లాల్ డ్యాన్స్‌తో మరోసారి ప్రూవ్ అయిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది.
#MohanLal – DANCE WITH TWO ACTRESS FOR BAAHUBALI SONG – From #Prabhas Film 😜😜💥💥pic.twitter.com/UYdLnP8AxQ
— GetsCinema (@GetsCinema) June 27, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 10-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

