మలయాళ చిత్రసీమలో మోహన్‌లాల్, శోభన హిట్ పెయిర్‌గా గుర్తింపును తెచ్చుకున్నారు. వారిద్దరూ కలిసి నటించిన నిరాట్టుకల్, ఇరుపట్టమ్, నూట్టనాడు, చెన్కోల్, మణిచిత్రతాజు వంటి చిత్రాలు అభిమానుల హృదయాల్లో నిలిచిపోయాయి. విశేషమేంటంటే, మళ్లీ 20 ఏళ్ల విరామం తర్వాత ఈజంట కలిసి నటించబోతున్నారు.
ఈ అగ్ర తారలిద్దరూ కలిసి నటిస్తున్న తాజా చిత్రం సోమవారం ప్రారంభమైంది. మోహన్‌లాల్ నటిస్తున్న 360వ చిత్రమిది. ఈ సినిమా ఆన్‌లోకేషన్ స్టిల్స్‌ను మోహన్‌లాల్ తన సోషల్‌మీడియా ఖాతా ద్వారా పంచుకున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత అద్భుత ప్రతిభావంతురాలైన శోభనతో కలిసి నటించడం ఆనందంగా ఉందని మోహన్‌లాల్ పేర్కొన్నారు. ఈ సక్సెస్ఫుల్ కాంబినేషన్ మరలా జత కట్టడంతో కేరళలోని వారి అభిమానులు సోషల్‌మీడియా వేదికగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.