తాప్సీ మిషన్ ఇంపాజిబుల్ చిత్రంలో విలక్షణ నటుడు..!

ఝుమ్మంది నాదం చిత్రంతో తెలుగు ప్రేక్షకులని పలకరించిన తాప్సీ ఆ తర్వాత పలు సినిమాలు చేసింది. ఇక్కడ చేసిన ఏ సినిమా కూడా ఈ అమ్మడికి పెద్దగా గుర్తింపు తేలేకపోయింది. దీంతో బాలీవుడ్ చెక్కేసిన ఈ ముద్దుగుమ్మ అక్కడ స్టార్ హీరోయిన్ అవతారం ఎత్తింది. విలక్షణ పాత్రలు పోషిస్తూ అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకుంది తాప్సీ.
బాలీవుడ్లోనే బిజీబిజీగా కాలం గడుపుతున్న తాప్సీ ఇప్పుడు ”మిషన్ ఇంపాజిబుల్ సినిమాతో తెలుగులో రీ ఎంట్రీ ఇస్తోంది. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన టాలెంటెడ్ డైరెక్టర్ స్వరూప్ ఆర్.ఎస్.జె ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో అద్భుతమైన రోల్ కోసం మలయాళ విలక్షణ నటుడు హరీశ్ పేరడీ ని ఎంపిక చేశారు.
హరీష్ పేరడీ.. ‘ఖైదీ, ‘స్పైడర్, ‘మన్యం పులి, ‘దొంగ, ‘అదిరింది, ‘విక్రమ్ వేద, ‘మడ్డి’ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు తెలుగులో ”మిషన్ ఇంపాజిబుల్” సినిమాలో మరో స్పెషల్ క్యారక్టర్ ప్లే చేస్తున్నారు హరీశ్. అతని పాత్ర ప్రత్యేకంగా ఉంటుందని టాక్. ‘మిషన్ ఇంపాజిబుల్’ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి – అన్వేష్ రెడ్డి లు నిర్మిస్తున్నారు. ఎన్ ఎం పాష అసోసియేట్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

