Mega Victory Mass | బాక్సాఫీస్ వద్ద ‘మెగా-విక్టరీ’ హంగామా.. ‘మన శంకరవరప్రసాద్ గారు’ నుంచి మాస్ సాంగ్ రిలీజ్!
Mega Victory Mass Song | రాబోయే సంక్రాంతికి థియేటర్లలో అసలైన పూనకాలు తెచ్చేందుకు సిద్ధమవుతున్నారు అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి.
Mega Victory Mass Song | రాబోయే సంక్రాంతికి థియేటర్లలో అసలైన పూనకాలు తెచ్చేందుకు సిద్ధమవుతున్నారు అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి. ఆయన ప్రధాన పాత్రలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. ఈ చిత్రంలో వెంకటేష్ ఒక పవర్ఫుల్ అతిథి పాత్రలో నటిస్తుండటం విశేషం. ఈ సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ‘ఆర్ యూ రెడీ’ అనే మాస్ పాటను విడుదల చేసింది. ప్రముఖ గీత రచయిత కాసర్ల శ్యామ్ అందించిన సాహిత్యం మాస్ ఆడియన్స్‌ను ఉర్రూతలూగిస్తోంది. “ఏంటి బాసూ సంగతీ.. అదిరిపోద్దీ సంక్రాంతీ.., ఏంటి వెంకీ సంగతీ.. ఇరగతీద్దాం సంక్రాంతీ..” అంటూ సాగే లైన్లు అభిమానుల చేత ఈలలు వేయిస్తున్నాయి.
మెగాస్టార్ తన సిగ్నేచర్ స్టెప్పులతో గ్రేస్‌ను చూపిస్తుంటే, వెంకటేష్ తనదైన కామెడీ టైమింగ్ మరియు మేనరిజమ్స్‌తో పాటలో జోష్ నింపారు. పాట చిత్రీకరణలో అనిల్ రావిపూడి తనదైన కలర్‌ఫుల్ అండ్ ఎనర్జిటిక్ మార్క్‌ను చూపించారు. ఈ చిత్రంతో మెగాస్టార్ మరోసారి తన బాక్సాఫీస్ స్టామినాను నిరూపించుకోవడానికి సిద్ధమయ్యారు. వెంకటేష్ తోడవ్వడంతో ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు మాస్ ప్రేక్షకులకు కూడా ఫుల్ మీల్స్ లాంటి విందు అని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

